రజినీ మూవీతో ఆడేసుకుంటున్న తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌.... రజినీకాంత్‌ ఫ్యాన్స్‌ ఆవేదన     2019-01-03   11:16:52  IST  Ramesh Palla

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సూపర్‌ స్టార్‌ అనిపించుకున్నాడు. రజినీకాంత్‌ చేసేవన్ని తమిళ సినిమాలే అయినా కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుగులో డైరెక్ట్‌ సినిమా కంటే ఎక్కువ స్థాయిలో విడుదల అవ్వడం చాలా ఏళ్లుగా వస్తున్న ఆనవాయితి. కాని ఈసారి మాత్రం రజినీకాంత్‌ ‘పేట’ చిత్రానికి తీవ్రమైన ఒడిదొడుకులు ఎదురవుతున్నాయి. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telugu Film Makers Playing With Rajinikanth Movie-New Releasing Movies In 2019 Petta Movie Release Date Sankranthi

Telugu Film Makers Playing With Rajinikanth Movie

ప్రముఖ నిర్మాత పేట తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నాడు. డబ్బింగ్‌ చేసి ప్రమోషన్‌ వర్క్‌ కూడా ప్రారంభించాడు. కాని ఇప్పటి వరకు ఈ చిత్రం కోసం థియేటర్లు దొరకడం లేదు.

Telugu Film Makers Playing With Rajinikanth Movie-New Releasing Movies In 2019 Petta Movie Release Date Sankranthi

తెలుగు పెద్ద సినిమాలు వినయ విధేయ రామ, ఎన్టీఆర్‌, ఎఫ్‌ 2 చిత్రాలు ఇప్పటికే థియేటర్లను బుక్‌ చేసుకున్న విషయం తెల్సిందే. ఆ కారణంగానే భారీ ఎత్తున థియేటర్లు ఆ మూడు సినిమాలకు కేటాయించడం జరిగింది. పెద్ద నిర్మాతల సినిమాలు అవ్వడంతో మంచి థియేటర్లన్నీ కూడా ఆ మూడు సినిమాలు పంచుకుంటున్నాయి.

Telugu Film Makers Playing With Rajinikanth Movie-New Releasing Movies In 2019 Petta Movie Release Date Sankranthi

చివరి నిమిషంలో సంక్రాంతి బరిలో నిలిచిన ‘పేట’ చిత్రానికి మాత్రం కొద్దిగొప్ప డొక్కు థియేటర్లు దక్కుతున్నాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా ఈ చిత్రం విడుదల అవుతున్న కారణంగా కూడా మంచి థియేటర్లు ఈ చిత్రానికి దొరడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రజినీకాంత్‌ మూవీకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్న నేపథ్యంలో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.