కూలీలు లేకుండా డ్రోన్ సహాయంతో వ్యవసాయం చేయబోతున్న తెలుగు రైతులు..!

వ్యవసాయం ఓ వైపు అంతరించిపోతూనే మరో వైపు దాని సాంకేతికతను పెంచుకుంటూ పోతోంది.చాలా మంది ఉన్న భూములను అమ్ముకుని వ్యవసాయం చేయడం ఆపేస్తున్నారు.

 Telugu Farmers Going To Farm With The Help Of Drones Without Laborers, Drones, W-TeluguStop.com

మరికొందరు అయితే ఇతర పనులకు భూమిని లీజుకు ఇచ్చేసి వాటితో వచ్చే డబ్బులతో కడుపు నింపుకుంటున్నారు.వ్యవసాయంలో లాభాలు రాక అప్పుల పాలై ఇంకొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే టెక్నాలజీ రోజురోజుకూ పెరిగే కొద్దీ సాంకేతికత అనేది పెరుగుతూ వస్తోంది.

వ్యవసాయం చేయడానికి అందుబాటులోకి అనేక పరికరాలు వచ్చాయి.

ఇంకా వస్తున్నాయి కూడా.సాగు చేయడానికి అనేక యంత్రాలను కనిపెట్టారు.

తాజాగా విత్తనాలు వేసే డ్రోన్ కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.ఈ డ్రోన్ సాయంతో కూలీల అవసరం లేకుండానే పంటలకు విత్తనాలను వేయొచ్చు.

వరి విత్తనాలు వేయడానికి డ్రోన్‌ ను వినియోగిస్తే చాలా వరకూ ఖర్చు తగ్గుతుంది.ఈ విషయాన్నే ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తించి దాన్ని కార్యరూపం దాల్చింది.

ప్రస్తుత కాలంలో వ్యవసాయానికి కూలీల కొరత ఎక్కువగా ఉంది.అందుకోసమే కూలీల అవసరం లేకుండానే డ్రోన్‌ సాయంతో విత్తనాలను విత్తే విధానంపై పరిశోధనలు ఎక్కువగా జరిగాయి.అందులో శాస్త్రవేత్తలు మంచి ఫలితాలు సాధించారు.హైదరాబాద్‌ కు చెందిన ఒక అంకుర సంస్థ ఈ కొత్త విధానంలో వరిపై సాగు చేస్తోంది.

సాధారణంగా అయితే నారు పెంచి, నాట్లు వేయడానికి ఎకరాకు ఆరేడు వేల డబ్బులు కావాల్సి ఉంటుంది.

డ్రోన్‌ను వాడితే ఆ డబ్బులను ఖర్చు చేయాల్సిన పని లేదు.దీని వల్ల రైతులకు ఖర్చు తగ్గిపోయి ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది.ప్రస్తుతం ఈ విధానం చాలా మందికి నచ్చింది.

రాబోవు రోజుల్లో వ్యవసాయంలో పూర్తి స్థాయిలో డ్రోన్ల వినియోగం వచ్చే అవకాశం ఉంటుంది.రైతులు డ్రోన్లను ఉపయోగించి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.

ఇప్పుడు తెలుగు రైతులు ఈ పద్దతికి నాంది పలుకుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube