ఈ డైరెక్టర్లకు మంచి రోజులు వస్తాయా ?

సినిమాకు డైరెక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు.అంటే మూవీకి సంబంధించి ప్రతి అంశం కూడా డైరెక్టర్ పైనే ఆధారపడి ఉంటుంది.

 Telugu Fade Out Directors Srinuvaitla Puri Jagannath Krishnavamsi Vv Vinayak Det-TeluguStop.com

ప్రేక్షకుడికి నచ్చేలా తెరకెక్కించడం డైరక్టర్ ( Director ) యొక్క పని.ఆ క్రమంలో మూవీ హిట్ అయిన ఆ క్రెడిట్ డైరెక్టర్ కే చెందుతుంది.అలాగే ఫ్లాప్ అయిన ఆ మూవీపై వచ్చే విమర్శలు డైరెక్టరే ఎక్కువగా బరించాల్సి ఉంటుంది.మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నప్పటికి వారి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నదర్శకులు చాలా తక్కువగా ఉంటారు.

సినిమా చూడగానే ఫలానా దర్శకుడి మూవీ అని వెంటనే ఆడియన్స్ గుర్తు పడతారంటే ఆ దర్శకులు ఇచ్చిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.మరి అలాంటి దర్శకులలో కొంతమంది ప్రస్తుతం ఫేడ్ అవుట్ స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎవరో చూద్దాం !

1.శ్రీనువైట్ల

Telugu Krishna Vamsi, Srinu Vaitla, Vv Vinayak, Directors, Puri Jagannath, Tolly

ఈ దర్శకుడి పేరు వినగానే ఇంటిళ్ళపాది చక్కటి ఆహ్లాదకరమైన కామిడీ మనకు తారసపడుతుంది.సొంతం, ఆనందం, వెంకీ, దుబాయ్ శీను, ఢీ, రెడీ, నమో వెంకటేశ, దూకుడు, బాద్ షా, వంటి ఎన్నో సినిమాల్లో తన కామిడీ స్టైలే వేరని నిరూపించి కామిడీ మూవీస్ తీయడంలో సరికొత్త ఒరవడినే తీసుకొచ్చారు శ్రీను వైట్ల.( Srinu vaitla ) కానీ మహేశ్ బాబు తో చేసిన ” ఆగడు “ మూవీ తరువాత శ్రీను వైట్ల కెరియర్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది.అప్పటినుంచి ఇప్పటివరకు కామ్ బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పటికి, ఫలితాలు మాత్రం కనిపించడం లేదు.మళ్ళీ ఆ వింటేజ్ శ్రీను వైట్లను చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.

2.వివి వినాయక్

Telugu Krishna Vamsi, Srinu Vaitla, Vv Vinayak, Directors, Puri Jagannath, Tolly

మాస్ సినిమాలు తీయడంలో వివి వినాయక్( VV Vinayak ) స్టైలే వేరు.ఏ హీరోకైనా సరికొత్త మాస్ ఇమేజ్ రావాలంటే వివి వినాయక్ డైరెక్షన్ లో నటించాల్సిందే.ఆది, చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్ వంటి సినిమాలతో తిరుగులేని మాస్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు పొందాడు.ఒకప్పుడు ఈయన డైరెక్షన్ లో చేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూ లో నిలుచునే వాళ్ళు.

కానీ అఖిల్, జెంటిల్ మెంట్ వంటి మూవీస్ డిజాస్టర్స్ తర్వాత ఈ డైరెక్టర్ కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీతో మళ్ళీ స్ట్రాంగ్ కామ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు వినాయక్.

3.పూరీ జగన్నాథ్

Telugu Krishna Vamsi, Srinu Vaitla, Vv Vinayak, Directors, Puri Jagannath, Tolly

సినిమాల యందు పూరీ సినిమాలు వేరయ అంటూ ఉంటారు.తన హీరోలకు యట్టిట్యూడ్ హీరోయిజాన్ని పరిచయం చేసి సినీ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచడంలో పూరీ మాస్టర్ మైండ్.ఈయన దర్శకత్వంలో వచ్చిన పోకిరి, దేశముదురు, ఇడియట్, బుజ్జిగాడు వంటి ఎన్నో సినిమాలు పూరీని టాప్ డైరెక్టర్స్ జాబితాలో చేర్చాయి.ప్రస్తుతం వరుస పరాజయాలతో పూరీ ( Puri jagannath ) కెరియర్ ఫేడ్ అవుట్ అయ్యే స్థితిలో ఉంది.

4.కృష్ణవంశీ

Telugu Krishna Vamsi, Srinu Vaitla, Vv Vinayak, Directors, Puri Jagannath, Tolly

ఫ్యామిలీ ఓరియంటెడ్ మరియు మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించడంలో కృష్ణవంశీ ( Krishnavamsi ) తన మార్క్ వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటారు.నిన్నే పెళ్లాడతా, సిందూరం, ఖడ్గం, మురారి వంటి సినిమాలతో ఓ వెలుగు వెలిగిన కృష్ణవంశీ.ప్రస్తుతం తన మార్క్ సినిమాలు రూపొందించడంలో విఫలం అవుతున్నాడు.

ప్రస్తుతం రంగమార్తాండ మూవీ చేస్తున్న కృష్ణవంశీ.ఈ మూవీతోనైనా సత్తా చాటుతాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube