మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం ను తాజాగా సీక్వెల్ చేశారు.మోహన్ లాల్ మీనా ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ సీక్వెల్ రూపొందింది.
సీక్వెల్ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది.మలయాళం వర్షన్ దృశ్యం 2 కు తెలుగులో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.షూటింగ్ ను మార్చిలో ప్రారంభించి కేవలం రెండున్నర మూడు నెలల్లోనే పూర్తి చేయాలని సురేష్ బాబు అండ్ టీమ్ భావిస్తున్నారు.
అంతా అనుకున్నట్లుగా జరిగితే ఎఫ్ 3 విడుదల అయిన కొన్ని వారాలకే ఈ సినిమాను కూడా విడుదల చేయాలని నిర్ణయించారు.ఇక ఈ సినిమా విషయమై ఉన్న పుకార్లకు కాస్త క్లారిటీ వచ్చినట్లయ్యింది.
తెలుగు దృశ్యంకు శ్రీ ప్రియ దర్శకత్వం వహించారు.అయితే ఈ సారి రీమేక్ కు ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ సినిమాలో మీనా నటించబోతుంది.దృశ్యం సినిమా లో వెంకటేష్ కు జోడీగా మీనా నటించింది.
ఇప్పుడు సీక్వెల్ లో కూడా వెంకటేష్ కు జోడీగా మీనాను ఎంపిక చేయడం జరిగింది.మోహన్ లాల్ కు జోడీగా దృశ్యం మరియు దృశ్యం 2 లో కూడా మీనా నటించింది.
అందుకే తెలుగు వర్షన్ లో కూడా మీనాను ఎంపిక చేయాలనే నిర్ణయాకి వచ్చారు.ఇక పిల్లల విషయమై ఇంకా మేకర్స్ నిర్ణయానికి వచ్చినట్లుగా లేరు.
చిన్న పాప ను మాత్రం గతంలో మాదిరిగా ఆమెనే కంటిన్యూ చేయబోతున్నారు.మొత్తానికి మలయాళ దృశ్యం 2 కు భారీ ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి.
తెలుగు వారు ఆ సినిమా ను చూడాలంటే భాష సమస్య గా మారింది.ఆ కారణంగా తెలుగు దృశ్యం 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.