ఇలియానా సోయగాలపై ఆసక్తి చూపించని తెలుగు దర్శకులు  

Telugu directors not interested on Ileana, Bollywood, Tollywood, South cinema, Indian cinema, Telugu cinema - Telugu Bollywood, Indian Cinema, South Cinema, Telugu Cinema, Telugu Directors Not Interested On Ileana, Tollywood

దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి ఇలియానా.తెలుగులో స్టార్ హీరోలతో జతకట్టిన ఈ అమ్మడు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు నెంబర్ వన్ గా ఉండేది.

 Telugu Directors Not Interested On Ileana

అయితే టాలీవుడ్ లో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈ భామ ఉన్నఫలంగా బాలీవుడ్ కి చెక్కేసింది.అక్కడ పీకు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన ప్రస్థానం మొదలు పెట్టింది.

అయితే బాలీవుడ్ లో వెలిగిపోవాలని కలలు కంటూ ముంబై ఫ్లైట్ ఎక్కేసిన ఈ అమ్మడికి అక్కడ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.అక్కడ అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

ఇలియానా సోయగాలపై ఆసక్తి చూపించని తెలుగు దర్శకులు-Movie-Telugu Tollywood Photo Image

అలాగే అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా బాలీవుడ్ దర్శకులకు తన సోయగాలను వాడుకోమని అవకాశం ఇచ్చినా కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.తెలుగులో ఈమెను చూపించినంత గ్లామర్ గా బాలీవుడ్ లో ఏ దర్శకులు చూపించలేదని చెప్పాలి.

అదే సమయంలో ఓ విదేశీ వ్యక్తితో ప్రేమాయణం కారణంగా ఈమెకు అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.అతనికి బ్రేకప్ చెప్పి మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టిన అనుకున్న స్థాయిలో మాత్రం దర్శకులు ఇలియానాని సంప్రదించడం లేదు.

ఈ నేపథ్యంలో తనకున్న పరిచయాలతో తెలుగు దర్శకులకి కూడా హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలని ఇలియానా సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.అయితే ఎప్పటికప్పుడు కొత్త భామలని పరిచయం చేస్తూ, కొత్త అందాలను తెరపై ఆవిష్కరిస్తున్న మన దర్శకులను ఇలియానా సోయగాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదని అంటున్నారు.

తెలుగు అగ్ర హీరోలు కూడా ఆమెతో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.దీంతో తెలుగులో ప్రయత్నాలు చేస్తున్న కూడా ఇలియానాని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Directors Not Interested On Ileana Related Telugu News,Photos/Pics,Images..