ఈ ఫోటోలో కనిపిస్తున్న పెళ్లి కొడుకు ఎవరో గుర్తుపట్టారా...?

తన మాటలతో మాయ చేస్తూ డైలాగులతో సినిమాని రక్తి కట్టించడంలో మంచి దిట్ట అయినటువంటి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “త్రివిక్రమ్ శ్రీనివాస్” గురించి సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో కొంతకాలం పాటు అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్ గా కూడా పని చేశాడు.

 Telugu Director Trivikram Srinivas Marriage Photo Viral-TeluguStop.com

అయితే అప్పట్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు ప్రముఖ కమెడియన్, హీరో సునీల్ కలిసి ఒకే రూమ్ లో ఉండే వాళ్ళని వీరిద్దరూ కలిసి సినిమా అవకాశాల కోసం ఒకే మోటార్ సైకిల్ పై తిరిగేవాళ్లని కూడా ఇప్పటికే చాలా మందికి తెలుసు.

అయితే తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Telugu Director Trivikram Srinivas Marriage Photo Viral-ఈ ఫోటోలో కనిపిస్తున్న పెళ్లి కొడుకు ఎవరో గుర్తుపట్టారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సోజన్యతో పెళ్లి జరుగుతున్న సమయంలో తీసినట్లు తెలుస్తోంది.అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ పెళ్లి సమయంలో చాలా లావుగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

దీంతో కొందరు అభిమానులు ఈ ఫోటో పై స్పందిస్తూ త్రివిక్రమ్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయాడని అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే అప్పట్లో త్రివిక్రమ్ సౌజన్య అక్కని పెళ్లి చూపులు చూసేందుకు వెళ్లి సౌజన్యతో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు.

ఆ తర్వాత ఇరివురు కుటుంభం సభ్యుల అంగీకారంతో 2002 సంవత్సరంలో వీరిద్దరి వివాహం జరిగింది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని బ్యానర్ నిర్మిస్తోంది.అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరో చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రానికి “అయినను పోయిరావలె హస్తినకు” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.అయితే ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం విజృంభిస్తున్న కారణంగా చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ నిలిపివేశారు.

అందువల్లనే ఈ చిత్రం విడుదల మరింతకాలం వాయిదా పడుతున్నట్లు సమాచారం.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.–  తెలుగుస్టాప్.కామ్ యాజమాన్యం

.

#Sunil #Sowjanya #TeluguDirector

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు