నేనెప్పుడూ హీరోయిన్స్ ని నా బెడ్ రూమ్ కి రమ్మనలేదు... అందుకే...

తెలుగులో ప్రముఖ స్వర్గీయ నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన “చిత్రం” అనే చిత్రానికి దర్శకత్వం వహించి తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన ప్రముఖ దర్శకుడు “తేజ” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే దర్శకుడు తేజ తన సినీ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నప్పటికీ పట్టు విడవకుండా శ్రమించి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎక్కువ శాతం సక్సెస్ రేటు ఉన్నటువంటి దర్శకుల్లో ఒకరిగా నిలిచారు.

 Telugu Director Teja About Casting Couch In Film Industry-TeluguStop.com

కాగా తాజాగా దర్శకుడు తేజ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని టాలీవుడ్ సినిమా పరిశ్రమలో “మీటూ” ఉద్యమంపై స్పందిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా క్యాస్టింగ్ కౌచ్ సమస్య అనేది సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉందని కానీ తాను ఎప్పుడూ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ సమస్య బారిన పడడం గాని లేదా ఇతరులను ఇందులోకి లాగడం గానీ చేయలేదని స్పష్టం చేశాడు.

 Telugu Director Teja About Casting Couch In Film Industry-నేనెప్పుడూ హీరోయిన్స్ ని నా బెడ్ రూమ్ కి రమ్మనలేదు… అందుకే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా తన చిత్రాలలో నటించే నటీనటుల క్యాస్టింగ్ కాల్ ను చాలా పకడ్బందీగా నిర్వహిస్తామని, అలాగే తనతో పాటు పని చేసే వారు ఎవరైనా ఈ కాస్టింగ్ కౌచ్ కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపాడు.అందువల్లనే తాను ఇప్పటివరకు ఇలాంటి సమస్యలను ఎదుర్కో లేదని కూడా స్పష్టం చేశాడు.

అయితే తాను గనుక క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొంటే కచ్చితంగా ఫిలిం ఛాంబర్ ని సంప్రదించి సినిమా పరిశ్రమలో ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యను నిర్మూలించేందుకు కఠిన నిబంధనలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటానని కూడా స్పష్టం చేశాడు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే తెలుగులో తేజ దర్శకత్వం వహించిన “సీత” అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది.

దీంతో తదుపరి చిత్రం విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.కాగా ప్రస్తుతం తేజ తెలుగులో చిత్రం సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం 2.0 అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.గతంలో ఈ చిత్ర సీక్వెల్గా విడుదలైన “చిత్రం” చిత్రం బాక్సాఫీసువద్ద మంచి విజయం సాధించింది.

#TollywoodFilm #Casting Couch #TeluguDirector #Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు