ఆమె 20 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది

గుంటూరులో పుట్టి పెరిగిన సుధ కొంగర సినిమాలపై ఆసక్తితో దాదాపు పాతికేళ్ల క్రితం చెన్నై వెళ్లింది.అక్కడ ఎంతో మంది సినీ ప్రముఖులను కలిసిన ఆమె చివరకు ప్రముఖ దర్శకుడు

మణిరత్నం వద్ద

అసిస్టెంట్‌గా చేరింది.

 Telugu Director Sudha Kongara Got Chance After 20 Years , Akasame Ni Haddura, Ma-TeluguStop.com

ఆయన తీసిన పలు సినిమాల్లో ఆమె భాగస్వామి అయ్యారు.మణిరత్నం వద్ద మాత్రమే కాకుండా పలువురు దర్శకుల వద్ద కూడా కథ చర్చల కోసం అసిస్టెంట్‌గా మారిన ఆమె దర్శకురాలిగా పేరు తెచ్చుకోవడానికి పదేళ్లు పట్టింది.

ఆమె మొదటి సినిమా దర్శకురాలిగా 2010 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ తర్వాత ఆమెకు వరుసగా సినిమాలు రాలేదు.

ఆమెకు ప్రతిభ ఉన్నా కూడా లేడీ దర్శకురాలు అనే అనుమానంతో కొందరు ఆమెను పక్కకు పెట్టే ప్రయత్నం చేశారు.కాని ప్రతిభ ఇప్పుడు కాకుంటే మరికొంత కాలంకు అయినా కూడా బయటకు రావడం పక్కా అనడంలో సందేహం లేదు ఇప్పుడు అదే జరిగింది.

Telugu Akashamenee, Sudha Kongara, Telugu-Latest News - Telugu

ఇరువై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆమెను పిలిచి ఆఫర్‌ ఇచ్చింది ఎవరు లేరు.కాని ఎప్పుడైతే ఆమె ఆకాశమే నీ హద్దురా సినిమాను ప్రేక్షకులకు చూపించిందో అప్పటి నుండి ఆమె ఫేట్‌ మారిపోయింది.ఆమె జోరు మొదలైంది.అయిదు పదుల వయసులో ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.దర్శకురాలిగా స్టార్‌డంను దక్కించుకోవాలని మొదటి నుండి ఆశించిన ఆమె ఇప్పుడు ఆమెకు వస్తున్న ఆఫర్లతో ఆమె తన ఆశయంను నెరవేర్చుకున్నట్లే కదా అనిపిస్తుంది.దర్శకురాలిగా ఆమె చేయబోతున్న సినిమాలపై ప్రస్తుతం ప్రతి ఒక్కరి దృష్టి ఉంది.

సుధ కొంగర గతంలో పలువురికి కథలు చెప్పారు.వారు అంతా కూడా ఇప్పుడు సుధను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే విజయ్‌ దేవరకొండ ఓపెన్‌గా నేను మీతో సినిమా చేయడం కోసం వెయిట్‌ చేస్తనున్నాను అంటూ పేర్కొన్నాడు.ఇంకా సుధ కొంగరకు ఎన్నెన్ని ఆఫర్లు వస్తాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube