ఈ ఫొటోలో కనిపిస్తున్న కపుల్స్ ఎవరో గుర్తు పట్టారా...?

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు “జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి.” అయితే జక్కన్న రాజమౌళి ఇప్పటివరకు దాదాపుగా 12 చిత్రాలకు దర్శకత్వం వహించాడు.కాగా 2001లో తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఆ మధ్య ప్రభాస్ తో తెరకెక్కించిన బాహుబలి వరకు రాజమౌళి బాక్సాఫీస్ వద్ద ఒక్క ఫ్లాప్ బారిన కూడా పడకుండా తిరుగులేని రారాజుగా దూసుకుపోతున్నాడు.అయితే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇంతగా విజయం సాధించడానికి తన జీవిత భాగస్వామి అయిన “రమా రాజమౌళి” కూడా ముఖ్య పాత్ర వహించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 Telugu Director Ss Rajamouli And Rama Rajamouli Marriage Day Photos Viral-TeluguStop.com

అయితే ఎస్ ఎస్ రాజమౌళి తన భార్య రమా రాజమౌళి ని 2001వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు.కాగా అప్పటి నుంచి ఇప్పటివరకు వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు, గొడవలు లేకుండా లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు.

అయితే “రమా రాజమౌళి” కూడా కాస్ట్యూమ్ డిజైనర్ కావడంతో రాజమౌళికి వృత్తి పరంగా చాలా ఉపయోగపడింది.ఇందులో భాగంగా రాజమౌళి తెరకెక్కించినటువంటి చిత్రాలకి రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేసింది.

 Telugu Director Ss Rajamouli And Rama Rajamouli Marriage Day Photos Viral-ఈ ఫొటోలో కనిపిస్తున్న కపుల్స్ ఎవరో గుర్తు పట్టారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇటీవల వీరిద్దరు పెళ్లి రోజు కావడంతో కొందరు అభిమానులు పెళ్లయిన కొత్తలో రమా రాజమౌళి మరియు ఎస్ ఎస్ రాజమౌళి ఎలా ఉండేవాళ్లో తెలియజేస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

దీంతో ఈ ఫోటోలపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ రమా రాజమౌళి మరియు ఎస్.ఎస్ రాజమౌళి అన్యోన్య దాంపత్యానికి చిరునామాగా ఉన్నారని అంతేకాక ఎంతోమంది నూతన నటీనటులకు మరియు యువ దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.

Telugu Rajamouli Wedding Photos, Rama Rajamouli, Rrr Movie Release Date, Rrr Movie Update, Telugu Director Ss Rajamouli, Telugu Director Ss Rajamouli And Rama Rajamouli Marriage Day Photos Viral-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగులో ఆర్.ఆర్.ఆర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.

దీంతో ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా షూటింగ్ పనులను నిలిపి వేయడంతో దాదాపుగా రెండు సార్లు ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు.

మరి ఈసారైనా అనుకున్న సమయానికి విడుదల చేస్తారో లేదో చూడాలి.

#RRR #RRR #TeluguSS #Rama Rajamouli #TeluguSS

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు