నాకు, ఆ హీరో భార్య మధ్య ఎలాంటి గొడవలు లేవు....

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విభిన్న కథనాలు ఎంచుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేయడం తో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటాడు.అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్న ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు.

 Telugu Director Rgv About Clash With Rajasekhar Wife Jeevitha-TeluguStop.com

కాగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ  తెలుగులో “దెయ్యం” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో తెలుగు ప్రముఖ హీరో రాజశేఖర్, తనికెళ్ళ భరణి, బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్, సనా, అనితా చౌదరి, బెనర్జీ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ఎప్పుడో మొదలైన ఈ చిత్ర షూటింగ్ పనులు ఎట్టకేలకు ఇటీవలే పూర్తయ్యాయి.దీంతో తాజాగా రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించి ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలను ప్రేక్షకులకు తెలియజేశాడు.

 Telugu Director Rgv About Clash With Rajasekhar Wife Jeevitha-నాకు, ఆ హీరో భార్య మధ్య ఎలాంటి గొడవలు లేవు….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టినప్పుడు తొందరగానే పూర్తి చేయాలననుకున్నప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల చాలా ఆలస్యం అయిందని తెలిపాడు.అంతేగాక ఈ చిత్రంలో హీరోగా నటించిన రాజశేఖర్ లుక్ మారిపోవడం మరియు ఇతర సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉండటం వల్ల కొంతకాలం పాటు ఆలస్యమైందని తెలిపాడు.

దానికితోడు తాను కూడా తనకు సంబంధించిన ఇతర చిత్ర ప్రాజెక్టులతో బిజీ అవడంతో ఈ చిత్ర షూటింగ్ ని అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయామని తెలిపాడు.అంతేతప్ప హీరో రాజశేఖర్ భార్య జీవితకి, తనకి ఎలాంటి గొడవలు లేవని కూడా స్పష్టం చేశాడు.

ఈ చిత్రంలో రాజశేఖర్ కూతురు పాత్రలో నటించిన స్వాతి దీక్షిత్ చాలా అద్భుతంగా నటించిందని కూడా కితాబిచ్చాడు.

అయితే ఈ చిత్ర షూటింగ్ పనులను మొదలు పెట్టిన సమయంలో ఈ చిత్రానికి వేరే టైటిల్ అనుకున్నప్పటికీ అనుకోకుండా “దెయ్యం” అనే టైటిల్ ని ఖరారు.

చేశారు కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 16వ తారీఖున థియేటర్లలో విడుదల చేయనున్నారు.ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా బాగానే అలరించింది.

#TeluguDirector #DeyyamMovie #Ram Gopal Varma #Director #Jeevitha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు