ఆ నటుడికి 50 లక్షలు ఇవ్వడానికి కూడా వెనుకాడరు.. కానీ మన కోట గారికి మాత్రం... 

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలియనివారుండరు.ఎప్పుడూ విభిన్న కథనాలను ఎంచుకుంటూ వైవిద్యభరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో కొంతమేర వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

 Telugu Director Ram Gopal Varma Sensational Comments On Bollywood Actors Remuner-TeluguStop.com

 అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ పాల్గొని బాలీవుడ్ నటీనటులకు టాలీవుడ్లో ఇచ్చేటువంటి పారితోషికం విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా ఎక్కువ మంది నటీనటులు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి పారితోషకం విషయమై కూడా వస్తుంటారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 అప్పట్లో తాను పరేష్ రావల్ అనే బాలీవుడ్ నటుడుని తానే నటుడిగా సినిమా పరిశ్రమకు పరిచయం చేశానని కానీ అతడి మొదటి సినిమా పారితోషకం కేవలం 50 వేల రూపాయలు మాత్రమేనని కానీ ఇప్పుడు పరేష్ రావల్ పారితోషికం దాదాపుగా 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉందని తెలిపాడు.

అయితే  బాలీవుడ్ లో  ఉన్నటువంటి పారితోషకం ఆధారంగానే వారు టాలీవుడ్ లో కూడా పారితోషకాలు తీసుకుంటారని కానీ టాలీవుడ్ లో నటీనటులు మాత్రం బాలీవుడ్ నటీ నటులకు ఇచ్చినటువంటి పారితోషకం కంటే ఎక్కువ పారితోషకం మాకు ఎందుకు ఇవ్వరని దర్శక నిర్మాతలను అడగ లేరని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 అందుకు ఉదాహరణగా తెలుగు లో కోట శ్రీనివాసరావు మంచి విలక్షణ నటుడని కానీ ఆయన మాత్రం పారితోషకం చాలా తక్కువగా ఉంటుందని కూడా తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “ఢీ కంపెనీ” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేయగా మంచి స్పందన లభించింది. అయితే ఈ నెల 23 వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్లు కూడారామ్ గోపాల్ వర్మ తెలిపాడు.

  ఈ చిత్రం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube