రామ్ గోపాల్ వర్మ కి శ్రీ రెడ్డి అంటే అస్సలు నచ్చదట.. ఎందుకో…  

Ram gopal varma, telugu director, actress sri reddy, nagnam , Sree rapaka, Devarapalli sweetya - Telugu Actress Sri Reddy, Devarapalli Sweety, Nagnam, Ram Gopal Varma, Sree Rapaka, Telugu Director

తెలుగులో ఇటీవలే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “నగ్నం” అనే చిత్రం ద్వారా తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకుల గుండెలో రైళ్లు పరిగెత్తించిన ముద్దుగుమ్మ దేవరపల్లి స్వీటి అలియాస్ శ్రీ రాపాక రోజు రోజుకి తెగ పాపులర్ అవుతోంది.అయితే తాజాగా శ్రీ రాపాక ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది.

 Telugu Director Ram Gopal Varma Is Dont Like Actress Sri Reddy

  ఇందులో భాగంగా తాను నగ్నం చిత్రంలో హీరోయిన్ గా ఎలా అవకాశం దక్కించుకుందో ప్రేక్షకులకు తెలియజేసింది.

అయితే ఇందులో భాగంగా తాను కూడా అందరిలాగే నగ్నం చిత్ర ఆడిషన్స్ కి వెళ్లానని అయితే  ఈ ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనని పిలిచి నీ పేరు ఏంటని అడిగాడని, అప్పుడు తాను తన పేరు శ్రీ రాపాక అని చెప్పానని చెప్పుకొచ్చింది.

రామ్ గోపాల్ వర్మ కి శ్రీ రెడ్డి అంటే అస్సలు నచ్చదట.. ఎందుకో…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో వెంటనే రామ్ గోపాల్ వర్మ తనకు శ్రీ అన్నా శ్రీ రెడ్డి అన్నా అస్సలు నచ్చదని కాబట్టి వెంటనే పేరు మార్చు కోవాలని చెప్పాడని ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ తనకి దేవరపల్లి స్వీటీ అని పేరు కూడా పెట్టాడని తెలిపింది.ఆ విధంగా తాను శ్రీ రాపాక నుంచి దేవరపల్లి స్వీటీ గా పేరు మార్చుకున్నానని కూడా చెప్పు కొచ్చింది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయం గురించి స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ కి శ్రీ రెడ్డి పేరు ఎందుకు నచ్చదో.? అంటూ ప్రశ్నిస్తున్నారు.మరికొందరు మాత్రం గతంలో శ్రీ రెడ్డి రామ్ గోపాల్ వర్మ సలహా మేరకే టాలీవుడ్ కి చెందినటువంటి ఓ ప్రముఖ స్టార్ హీరోపై పలు వ్యక్తిగత విమర్శలు చేసి సినీ పరిశ్రమకు దూరం అయిందని ఆ తరువాత రామ్ గోపాల్ వర్మతో కూడా  విభేదాలు రావడంతో రామ్ గోపాల్ వర్మ పై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని అందువల్లే రామ్ గోపాల్ వర్మ కి శ్రీ రెడ్డి అంటే ఇష్టం ఉండదని అంటున్నారు.

దాంతో రామ్ గోపాల్ వర్మ కి శ్రీరెడ్డి అంటే ఎందుకు ఇష్టం ఉండదో అతడు చెబితేనే సరైన స్వస్థత ఉంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  మరి రామ్ గోపాల్ వర్మ కి శ్రీరెడ్డి అంటే ఎందుకు ఇష్టం ఉండదో చెబుతాడో లేదో చూడాలి.

#Nagnam #Ram Gopal Varma #Sree Rapaka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Director Ram Gopal Varma Is Dont Like Actress Sri Reddy Related Telugu News,Photos/Pics,Images..