తెలుగులో తన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ఏదో ఒక విషయంపై స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.
కాగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డేంజరస్ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో నైనా గంగూలి, అప్సర రాణి, హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం షూటింగ్ పనులను రామ్ గోపాల్ వర్మ గోవాలో మొదలు పెట్టారు. అయితే ఇందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నైనా గంగూలీ, అప్సర రాణి లతో దిగినటువంటి కొన్ని ఫోటోలను తన అధికారిక సోషల మాధ్యమాల ద్వారా షేర్ చేశాడు.
అంతేగాక ప్రతిరోజు బ్యూటిఫుల్ హీరోయిన్లతో పార్టీ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ ఈ ఫోటోలు సోషల్ మీడియా మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే తన సినిమాల్లో కంటెంట్ పెద్దగా లేకపోయినప్పటికీ ప్రమోషన్స్ తో కలెక్షన్లును కొల్లగొట్టేటువంటి రామ్ గోపాల్ వర్మ కి ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడని అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో రామ్ గోపాల్ వర్మ 12 ఓ క్లాక్, కరోనా వైరస్, మర్డర్, ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే చిత్రాలకి దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా లాక్ డౌన్ సమయంలో దర్శక నిర్మాతలు సినిమా షూటింగులకు దూరంగా ఉంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం థ్రిల్లర్, పవర్ స్టార్, నగ్నం, తదితర చిత్రాలను ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తూ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశాడు.