కుక్కలన్ని కలసి కట్టుగానే ఉంటాయని అంటూ పూరి కామెంట్స్ ...

తెలుగులో తన రొమాంటిక్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే పూరీ జగన్నాథ్ సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసి ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “బద్రి” అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

 Telugu Director Puri Jagannadh Sensational Comments On Nepotism In Film Industry-TeluguStop.com

 ఆ తర్వాత వరుసగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి స్టార్ హీరోల చిత్రాలకి దర్శకత్వం వహించి ప్రేక్షకులని బాగానే అలరించాడు.

అయితే ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్ మోటివేషనల్ వర్డ్స్ పేరుతో ఆడియోలను విడుదల చేస్తూ కుర్రకారుని బాగానే ఆకట్టుకుంటున్నాడు.

  తాజాగా పూరి జగన్నాథ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెపోటిజం ‘బంధుప్రీతి’ అనే అంశంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా ఒకే వీధిలో ఉన్నటువంటి కుక్కలు అన్ని కలిసి కట్టుగానే ఉంటాయని అలాగే పక్క వీధిలోని కుక్కలని తమ జట్టులోకి రానివ్వని అలాగే సత్తా ఉన్న వారిని ఎవరూ ఆపలేరని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అంతేగాక మనుషులందరూ ఒకే రేసులో ఉంటారని అందులో విజయం సాధించిన వాడి వెనక ప్రపంచం పరిగెడుతుందని ఒకవేళ వాడి పిల్లలు, లేదా ఇతర వారసులు విజయాన్ని సాధిస్తే కొందరు నెపోటిజం అంటూ కామెంట్ చేస్తుంటారని,  అలా అయితే దేవుడి పిల్లలు కూడా  నెపో కిడ్స్ అంటూ కామెంట్లు చేశాడు.దీంతో సినిమా ఇండస్ట్రీలో నెపోటిజంపై పూరి జగన్నాథ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Telugu Nepotism, Puri Jagannadh, Telugu, Telugupuri, Tollywood-Movie

అయితే ఈ విషయంలో ఉండగా తెలుగులో ప్రస్తుతం పూరి జగన్నాథ్ “ఫైటర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube