అల్లు అర్జున్ గీతా గోవిందం కథ విని అలా అన్నాడు... దాంతో విజయ్ దేవరకొండ...

తెలుగులో ప్రముఖ దర్శకుడు “పరుశురామ్” దర్శకత్వంలో వచ్చిన “గీత గోవిందం” అనే చిత్రం టాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ కి ఈ చిత్రం తన సినీ కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచిపోయింది.

 Telugu Director Parasuram About Allu Arjun Comments On Geetha Govindam Movie Script-TeluguStop.com

అంతేకాక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కానంద బ్యూటీ రష్మిక మందన్నకి కూడా ఓవర్ నైట్ స్టార్ డమ్ తో పాటు బోలెడన్ని సినిమా ఆఫర్లు తెచ్చిపెట్టింది.కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను దర్శకుడు పరుశురామ్  ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తి కర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండని ఎంపిక చేయకముందు అతడికి పెద్దగా స్టార్ డమ్ లేదని కానీ ఇదే సమయంలో “అర్జున్ రెడ్డి” చిత్రం హిట్ అవ్వడంతో ఒక్కసారిగా తనలో టెన్షన్ మొదలైందని చెప్పుకొచ్చాడు.అందువల్లనే ఈ చిత్ర షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహించానని తెలిపాడు.

 Telugu Director Parasuram About Allu Arjun Comments On Geetha Govindam Movie Script-అల్లు అర్జున్ గీతా గోవిందం కథ విని అలా అన్నాడు… దాంతో విజయ్ దేవరకొండ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండ ని ఎంపిక చేయక ముందు ఈ చిత్ర కథని మొదటగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి వినిపించానని దాంతో అల్లు అర్జున్ చాలా బాగుందంటూ మెచ్చుకున్నాడని తెలిపాడు.అయితే తాను మొదటగా అల్లు అర్జున్ కి కేవలం కథ పరంగా మాత్రమే వినిపించానని హీరోగా నటింపజేయాలని అనుకోలేదని స్పష్టం చేశాడు.

దీనికితోడు అప్పుడప్పుడే అల్లు అర్జున్ సరైనోడు చిత్రం తో హిట్ కొట్టి మాస్ ఇమేజ్ తో ఊపు మీద ఉన్నాడని అందువల్లనే అల్లు అర్జున్ కి ఈ కథ సూట్ కాదని అనుకున్నానని తన మనసులో మాటను బయట పెట్టాడు.అలాగే ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకున్నానని తప్ప ఇంత పెద్ద హిట్ అవుతుందని అస్సలు అనుకోలేదని చెప్పుకొచ్చాడు.

ఇక విజయ్ దేవరకొండ స్వభావం గురించి స్పందిస్తూ విజయ్ అందరి పట్లా చాలా వినయంగా ఉంటాడని అంతేగాక చాల గౌరవంగా ప్రవర్తిస్తాడని అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న హీరో ని తాను ఇప్పటివరకూ టాలీవుడ్ లో చూడలేదని చెప్పుకొచ్చాడు. 

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పరశురామ్ తెలుగులో “సర్కారు వారి పాట” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా మహానటి చిత్ర ఫేమ్ “కీర్తి సురేష్” హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు మరియు లిరికల్ సాంగులు విడుదల కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరి దర్శకుడు పరశురామ్ ఈ చిత్రంతో ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

#SarkariVari #Parasuram #GeethaGovindam #AlluArjun #TeluguDirector

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు