హాంకాంగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తున్న తెలుగు దర్శకుడు  

Telugu Director Making Hong Kong Movie, Bollywood, Director Sri Kishore, Ind-Chinese movie, My Indian Boyfriend - Telugu Bollywood, Director Sri Kishore, Ind-chinese Movie, My Indian Boyfriend, Telugu Director Making Hong Kong Movie

తెలుగు కుర్రాళ్ళు హాలీవుడ్ సినిమాలకి కూడా పని చేస్తూ తన సత్తా చాటుతున్నారు.అలాగే బాలీవుడ్ లో కూడా మన లోకల్ టాలెంట్ కి మంచి గుర్తింపు ఉంది.

TeluguStop.com - Telugu Director Making Hong Kong Movie

ఇక తెలుగు సినిమా రేంజ్ కూడా ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి చేరుకుంది.ఇండియన్ సినిమా అంటే ఇప్పుడు హిందీ సినిమాల గురించి కంటే రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్, ప్రభాస్ సాహో, రాదేశ్యామ్ సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.

బాలీవుడ్ మార్కెట్ ని దాటుకొని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెలుగు సినిమా సత్తా చాటుతుంది.దీంతో ఇతర దేశాలలో కూడా తెలుగు సినిమాలపై ఆసక్తి చూపించే వారు ఎక్కువయ్యారు.

TeluguStop.com - హాంకాంగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తున్న తెలుగు దర్శకుడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అలాగే ఇక్కడి దర్శకులు విదేశాలు వెళ్లి అక్కడ తమ టాలెంట్ తో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే ఇప్పుడు హాంకాంగ్‌ అమ్మాయి, ఇండియా అబ్బాయిల మధ్య చిగురించిన ప్రేమ కథ ఇతివృత్తంగా ‘మై ఇండియన్‌ బాయ్‌ఫ్రెండ్‌చిత్రం ఓ తెలుగు కుర్రాడు దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

నల్గొండకు చెందిన శ్రీకిశోర్‌ గతంలో సశేషం, భూ, దేవి శ్రీ ప్రసాద్‌ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.హాంకాంగ్ లో స్థిరపడ్డ అతను తెలుగు సినిమాల ద్వారా వచ్చిన అనుభవంతో ఇప్పుడు హాంకాంగ్ లో ఒక సినిమాని తెరకేక్కిస్తున్నాడు.

మై ఇండియన్‌ బాయ్ ఫ్రెండ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.ఇందులోని నటీనటులందరు హాంకాంగ్‌ కు చెందిన వారే కావడం విశేషం.అలాగే సినిమా షూటింగ్‌ మొత్తం హాంకాంగ్‌ లోనే పూర్తి చేశారు. హిందీ, కాన్టోనీస్‌ భాషలలో ఈ సినిమాని ఆవిష్కరించారు.

కరణ్‌ చోలి హీరోగా, హాంకాంగ్ నటి షిర్లీ చాన్‌ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తున్నారు.మొత్తానికి విదేశీ భాషలో సినిమాని తీసిన ఈ తెలుగు యువ దర్శకుడుకి అక్కడ ఎంత వరకు సక్సెస్ వస్తుంది అనేది వేచి చూడాలి.

#MyIndian #DirectorSri #TeluguDirector

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Director Making Hong Kong Movie Related Telugu News,Photos/Pics,Images..