తెలుగులో అక్కినేని హీరో కింగ్ “నాగార్జున” హీరోగా నటించిన “సోగ్గాడే చిన్నినాయన” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన టాలీవుడ్ యువ దర్శకుడు “కళ్యాణ్ కృష్ణ” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే వచ్చీరావడంతోనే హిట్ కొట్టడంతో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ “నేల టికెట్టు” చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు.
కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.ఆ తర్వాత నాగచైతన్యతో తీసిన “రారండోయ్ వేడుక చూద్దాం” చిత్రం ప్రేక్షకులని బాగానే అలరించింది.
అయితే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో జరిగినటువంటి గొడవ పై తాజాగా కళ్యాణ్ కృష్ణ ఓపెన్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని క్లారిటీ ఇచ్చాడు.
ఇందులో భాగంగా తనకి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి మధ్య ఎలాంటి గొడవలు, వివాదాలు లేదని స్పష్టంచేశాడు.
అంతేకాకుండా తనకి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి స్నేహితులలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరని తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పుకొచ్చాడు.అయితే తను రారండోయ్ వేడుక చూద్దాం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ ముఖానికి చున్నీ అడ్డుపెట్టుకుని ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిందని అలాగే ఆ ఫోటోకి ఇంతకంటే ఎక్కువ చెబితే తన డైరెక్టర్ తో గొడవ జరుగుతుందని సరదాగా పోస్ట్ చేసింది.
దీంతో కొందరు ఏకంగా రకుల్ ప్రీత్ సింగ్ కి మరియు కళ్యాణ్ కృష్ణ కి మధ్య గొడవలు ఉన్నాయని ప్రచారాలు చేశారు.అయితే కళ్యాణ్ కృష్ణ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో ఈ గొడవ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ తెలుగులో “బంగార్రాజు” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఈ చిత్ర టైటిల్ మరియు కథ ఎప్పుడో రిజిస్టర్ చేయించినప్పటికీ ఇప్పటికీ సెట్స్ పైకి వెళ్లలేదు.
దీంతో ఈ విషయంపై కూడా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ క్లారిటీ ఇచ్చాడు.సోగ్గాడే చిన్నినాయన చిత్రం విడుదలైన వారం రోజుల తర్వాత నాగార్జున కి బంగార్రాజు చిత్ర కథను చెప్పానని దాంతో కథ నచ్చడంతో నాగార్జున వెంటనే హీరోగా నటించడానికి ఒప్పుకున్నాడని తెలిపాడు.
కానీ అప్పటికే సోగ్గాడే చిన్నినాయన మంచి హిట్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు బాగానే పెరిగాయని దాంతో కొంతకాలం పాటు బంగార్రాజు చిత్రాన్ని తెరకెక్కించడానికి సమయం తీసుకున్నామని తెలిపాడు.అందువల్లనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి టైమ్ పట్టిందని కూడా చెప్పుకొచ్చాడు.