కరోనాకు తనవద్ద మందు ఉందంటున్న తెలుగు డైరెక్టర్  

Telugu Director Developed Vaccine For Corona - Telugu Corona, T Prabhakar, Tollywood News, Vaccine

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఈ మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు పలు దేశాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.కాగా ఈ వైరస్‌తో లక్షల సంఖ్యలో ప్రాణాలు పోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

 Telugu Director Developed Vaccine For Corona

ఈ వైరస్‌కు వ్యాక్సిన్ రావాలంటే మరో ఏడాది సమయం పడుతుందని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు అంచనా వేస్తున్నారు.

కానీ ఈ కరోనా వైరస్‌కు తనవద్ద ఓ వ్యాక్సిన్ రెడీగా ఉందని, ఇది ఖచ్చితంగా వ్యాధిని తగ్గిస్తుందని టాలీవుడ్‌కు చెందిన ఓ డైరెక్టర్ అంటున్నాడు.

కరోనాకు తనవద్ద మందు ఉందంటున్న తెలుగు డైరెక్టర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

టాలీవుడ్ డైరెక్టర్ టి.ప్రభాకర్ తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసినా చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలు బాధపడుతుండటంతో, తన వద్ద దీనికి మందు ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.తన వద్ద ఉన్న వ్యాక్సిన్ మనుష్యులపై ఖచ్చితంగ పనిచేస్తుందని, ఇది గొంతులో ఉండే కరోనా వైరస్‌ను కేవలం 8-12 రోజుల్లో ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

ఈమేరకు తన వద్ద ఉన్న సహజసిద్ధమైన మందును ప్రయోగించేందుకు అనుమతినివ్వాలని సీఎం కేసీఆర్‌కు ఓ లేఖ రాశానని చెప్పుకొచ్చారు.దీంతో WHO డైరెక్టర్ మైఖేల్ ర్యాన్, బ్రిటన్ మరియు ఇటలీ ప్రధాన మంత్రులు తన మందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అనడంతో వారి వ్యా్ఖ్యలను తప్పని నిరూపిస్తాని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తన మందు ఖచ్చితంగా కరోనా వైరస్‌ను తగ్గిస్తుందని ఆయన అంటున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Director Developed Vaccine For Corona Related Telugu News,Photos/Pics,Images..

footer-test