అలనాటి నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి  

ప్రముఖ నటి, దర్శకురాలు మరియు సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యం కారణంగ గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. .

అలనాటి నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి-

1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు.విజయనిర్మల ఏడు సంవత్సరాల వయసులోనే 1950లో మత్య్సరేఖ తమిళ చిత్రం ద్వారా బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు.పదకొండో ఏట ‘పాండురంగ మహత్యం’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. తెలుగులో ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా కథానాయకిగా నటించారు.

సుమారు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమె పెళ్లి కానుక సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం కూడా చేసారు.