తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్న టీడీపీ..!!

త్వరలో తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉప ఎన్నికలలో వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన టిఆర్ఎస్ పార్టీకి ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలవడంతో.

 Telugu Desam Party To Contest In Telangana By Elections-TeluguStop.com

రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం మొదలైంది.దీంతో త్వరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ టిఆర్ఎస్ మాత్రమేకాక కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు రెడీ అవుతూ ఉన్నాయి.

మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణలో చాలావరకు డౌన్ ఫాల్ లో ఉన్న టిడిపి.

 Telugu Desam Party To Contest In Telangana By Elections-తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్న టీడీపీ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగడానికి రెడీ అయినట్లు ఆ పార్టీ ఇంచార్జి మువ్వ అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.తానే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు హై కమాండ్ ఆదేశించినట్లు స్పష్టం చేశారు.

నాగార్జున సాగర్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అని తెలిపారు.కాగా జరగబోయే ఉప ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక జరగనుంది.

#Congress #Jana Reddy #Tdp In Charge

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు