తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 7,ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.16

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu Sunday 7 March 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.04

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.07.00 నుంచి 10.00 వరకు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు బాగుంటుంది.మీరు చేసిన కొన్ని పొరపాట్లను సరిదిద్దుకుంట‌ారు.ఇతరుల వ్యక్తిత్వం గురించి అర్థం చేసుకుంటారు.

విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంది.లాభాలు ఎక్కువగా ఉండటంవల్ల వాహన కొనుగోలు చేస్తారు.మీరు పనిచేసే స్థానం బదిలీ అయ్యే అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీరు కాస్త ఇబ్బందికరంగా ఉంటారు.కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకుండా ఉండడం వల్ల చికాకు చెందుతారు.ఎక్కువ ఖర్చులు చేయడం వల్ల ధన నష్టాలు ఉంటాయి.కొన్ని పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు ఇతరులకి ఇచ్చే సొమ్మును తీరుస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.కొన్ని లాభాలు ఏర్పడుతాయి.

ముఖ్యమైన పనులలో మంచి అవకాశాలు వస్తాయి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.విద్యార్థులు తమ చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కాపాడుకోవాలి.

స్నేహితులతో ఆలోచించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఎక్కువ ఒత్తిడి అవుతుంది.

సింహం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉండటం వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.మీ వ్యక్తిత్వం వల్ల మీ శత్రువులు మిత్రులు అవుతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.విద్యార్థులు తమ సమయాన్ని వృథా చేయకూడదు.

కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవడం వల్ల ప్రశంసలు అందుతాయి.

తులా:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.విద్యార్థులకు చదువుపట్ల అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు ఇతరులకు ఇచ్చే సొమ్ము కాస్త ఆలస్యం అవుతుంది.తోబుట్టువులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది.కొన్ని పనులలో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

మకరం:

ఈరోజు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

విలువైన సమయాన్ని వృథా చేస్తారు.ఒకరిని నమ్మి మోసపోతారు.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనారోగ్య సమస్య ఏర్పడుతుంది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

మీనం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల ఆర్థికంగా నష్టాన్ని ఎదుర్కొంటారు.ఇతరులకు మీరిచ్చే సొమ్ము ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

#Jathakam #Daily Horoscope #TeluguDaily #March7

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL