ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.57
సూర్యాస్తమయం: సాయంత్రం 05.59
రాహుకాలం: సా.07.42 నుంచి 09.12 వరకు
అమృత ఘడియలు: ఉ 09.10 నుంచి 09.45 వరకు
దుర్ముహూర్తం: మ 12.21 నుంచి 01.09 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రాశి వారు ఈ రోజు గృహ సంబంధించిన ఖరీదైన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దీని వల్ల కొంత ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు మీ ఆరోగ్య పరిస్థితి పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.మీకు నచ్చిన వారితో కాలం గడిపి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు.రోజంతా ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి.
వృషభం:

ఈ రాశి వారికి పరిచయం లేని వ్యక్తుల వల్ల పెట్టిన పెట్టుబడులకు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.కాలక్షేపం కోసం సమయం వృధా చేయొద్దు.ఆలోచించకుండా ఎదురు మాట్లాడితే బంధువులతో ఇబ్బందులు వస్తాయి. మీ వైవాహిక జీవితం కు మధ్య ఇతరులను రానివ్వకపోవడం మంచిది.
మిథునం:

ఈ రాశి వారు ఈ రోజు ఏ పని చేసినా సాధారణ సమయం కంటే తక్కువ సమయంలోనే పూర్తి చేస్తారు.ఎప్పటినుండో ప్రయత్నిస్తున్న రుణాల కోసం ఈరోజు అనుకూలంగా కలసి వస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యుల నుండి మంచి సలహాలు పొందుతారు. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కర్కాటకం:

ఈ రాశి వారు ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఒక వార్త మీ కుటుంబం మొత్తానికి సంతోషాన్ని ఇస్తుంది.మీ స్నేహితుల నుండి మీకు ధైర్యం, సంతోషం దొరుకుతుంది.
ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉంటుంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ జీవితభాగస్వామికు, మీకు మధ్యన ఇతరులు విభేదాలు పెట్టడానికి ప్రయత్నిస్తారు.
సింహం:
ఈ రాశి వారు తమ స్నేహితులతో కలిసి బయట ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్య విషయాలపై దృష్టి పెట్టండి.మీరు ఇంతకుముందు పెట్టిన ఖర్చులు ఉంటే ఇప్పుడు దాని పరిణామాలను అనుభవిస్తారు. ఈ రోజంతా మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది.
కన్య:

ఈ రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది.ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు.గ్రహాలూ, నక్షత్రాల ప్రభావం వల్ల ధనలాభం ఉంటుంది.
కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంది.మీ బంధువుల ప్రవర్తన లో కొంత మార్పు కనిపిస్తుంది.ఈరోజు ప్రయాణాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి.
తులా:

ఈ రాశి వారు ఈ రోజు అనవసరమైన ఖర్చులు చేయకపోవడం మంచిది.మీ కుటుంబ సభ్యులతో ఆవేశపడకుండా ఆలోచించి మాట్లాడండి.మీరు కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సిన విషయంలో మీ జీవిత భాగస్వామ అనుకరించ పోవచ్చు. అవసరం అనిపిస్తే నే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయండి.
వృశ్చికం:

ఈ రాశి వారు అప్పుగా ఇచ్చిన డబ్బును వారి నుండి తిరిగి పొందుతారు. ఏ కారణం లేకుండా జీవితభాగస్వామితో గొడవ పడవచ్చు.కొంతవరకు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.మీ కుటుంబం మొత్తానికి అనుకూలంగా ఉండేటట్లు సలహాలు తీసుకోండి.
ధనస్సు:

ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రదేశాలు సందర్శించడం చేస్తారు. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవం ఉన్న వారి దగ్గర సలహాలు తీసుకోవడం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు.
మీ సమయం ఆవేశంతో గడుస్తుంది.కోర్టు సమస్యలకు లాయర్ దగ్గరకు వెళ్లే మంచి అవకాశం ఉంది.
మకరం:

ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.తెలిసిన వారితో సంతోషంగా గడుపుతారు.ఊహించని బహుమతులను మీ బంధువులు మీకు అందిస్తారు.అప్పులు వసూలు అవుతాయి.కుటుంబ సభ్యులతో వస్తువుల కొనుగోలు చేస్తారు.ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి.
కుంభం:

ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు ఉన్నాయి.మీ కుటుంబ సభ్యుల నుండి ధనాన్ని పొందుతారు.మీరు ఇతరులకు ఇచ్చే సలహా తగ్గట్టుగా మీరు కూడా సలహాలను పాటించాలి.ఇతరులతో మంచి సమయాన్ని గడుపుతారు.వైవాహిక జీవితానికి సంబంధించిన మంచి వార్తలు వినబడతాయి.
మీనం:

ఈ రాశివారికి ఇంట్లో పండుగ వాతావరణం కనబడుతుంది.దీనివల్ల మనస్సు నిశ్చలంగా, హాయిగా ఉంటుంది.ఇతర కాలక్షేపాలతో సమయం వృధా చేయకూడదు.
భవిష్యత్ గురించి పక్కన పెట్టి మీ భాగస్వామితో గడపండి.మీరు చేసే ప్రయాణంలో అనుకోని పరిచయంతో మంచి అనుభవంను తెలుసుకుంటారు.
LATEST NEWS - TELUGU