తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 7, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 7 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.11

రాహుకాలం మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు అమావాస్య ఈ రోజు మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో ఒప్పందాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని వివాదాలు ఎదురయ్యే సమస్య ఉంది.వెంటనే వాటిని పరిష్కరించుకోవాలి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

వృషభం:

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు.కొన్ని వివాదాలు తొలగిపోతాయి.కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యల గురించి మాట్లాడుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

కర్కాటకం:

ఈరోజు తీరికలేని సమయం గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన అంశాల గురించి బాగా ఆలోచనలు చేస్తారు.

అనవసరంగా వాదనలకు దిగకండి.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీ పాత స్నేహితులు కలుస్తారు.

వారితో సమయాన్ని గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

ధనస్సు:

ఈరోజు మీకు కొన్ని ఫలితాలు అందుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.పిల్లలతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఈరోజు సమయాన్ని వృథా చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube