తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 24, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 24 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.55

రాహుకాలం:ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు:ఉ.06.00 నుంచి 08.00వరకు

దుర్ముహూర్తం:ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం మంచిది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.సంతానం పట్ల ఆలోచిస్తారు.

కొన్ని న్యాయపరమైన పనులు పూర్తవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

కన్య:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

తులా:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకున్న సమయానికంటే ముందే పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కొన్ని న్యాయపరమైన పనులు పూర్తవుతాయి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసేచోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

మకరం:

ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా ఇంటికి బంధువులు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట కూడా గొడవలకు దూరంగా ఉండాలి.

#Daily Horoscope #Jathakam #TeluguDaily #Friday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU