ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.57
సూర్యాస్తమయం: సాయంత్రం 06.03
రాహుకాలం: సా.12:13 నుంచి 01.43 వరకు
అమృత ఘడియలు: ఉ 09:10 నుంచి 09.35 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:35 నుంచి 12.23 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రాసి వారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు అలోచించి నిర్ణయం తీసుకొండి.పెద్దలు, తల్లితండ్రుల సలహాలు తీసుకుంటే మంచిది.ఈరోజు చివరిలో కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృషభం:

ఈరోజు ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదర్కొంటారు.గతం మీరు చూపిన నిర్లక్ష్యమే ఈరోజు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది.ఉద్యోగంలో చికాకులు ఉన్నప్పటికి కుటుంబసభ్యులు మీకు సంతోషాన్ని ఇస్తారు.
మిథునం:

ఈరోజు ఆర్ధికంగా ఇబ్బందులకు గురవుతారు.అయితే డబ్బు ఖర్చు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది.అంతేకాదు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించి పెట్టండి.
కర్కాటకం:

కొందరితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట్లాడండి.ఏదైనా వస్తువు కొనేముందు ఒకటికి రెండు సార్లు అలోచించి కొనండి.మీ ఇంటికి అనుకోని అతిథి వచ్చి మంచి శుభవార్త చెప్పి వెళ్తాడు.
సింహం:

వ్యాపారాల్లో మంచి లాభాలను చూస్తారు.పిల్లల చదువు కోసం డబ్బును ఖర్చు పెడుతారు.ఈరోజు అంత కుటుంబంతో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.రోజు చివరిలో భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
కన్య:

వ్యాపారాల్లో నష్టాలు రావడంతో మానసికంగా దెబ్బ తింటారు.ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఈరోజు అంత చికుచికాకుగా గడుస్తుంది.ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఆలోచిస్తే మంచిది.
తులా:

వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.కొన్ని ఒత్తిడులు కారణంగా మానసిక ప్రశాంతత కరువవుతుంది.గంటసేపు ధ్యానం చేస్తే మంచిది.
వృశ్చికం:

కొన్ని విషయాల్లో చికాకులు ఉంటాయ్.మాట్లాడే సమయంలో నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే మంచిది.లేదంటే ఇబ్బందులు పడుతారు.
పిల్లల చదువు ఆనందాన్ని ఇస్తుంది.ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయ్.ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
ధనస్సు:

మానసిక ప్రశాంతత ఉండదు.ధ్యానం చెయ్యడం మంచిది.ఇతరులతో నవ్వుతు మాట్లాడండి.
కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపేందుకు సమయాన్ని వెచ్చించండి.ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
మకరం:

గతంలో చేసిన పొదుపు ఇప్పుడు ఉపయోగపడుతుంది.కొందరి సలహాలు సూచనలు ఎంతో ఉపయోగపడుతాయ్.పాతమిత్రులను కలిసి సాయింత్రం సమయాన్ని ఆనందంగా ఆస్వాదిస్తారు.జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.
కుంభం:

వ్యాపారాల్లో మంచి లాభాలను చూస్తారు.ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు.అనారోగ్య సమస్య లేకుండా సమయాన్ని ఆనందంగా గడుపుతారు.ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది.
మీనం:

కుటుంబంలో చిన్నపాటి గొడవలు జరుగుతాయ్.ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.పిల్లలతో కాస్త సమయాన్ని సరదాగ గడపండి.జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా నిర్ణయం తీసుకోండి.
DEVOTIONAL