తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 23, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 23 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.55

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.08.00 నుంచి 09.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని న్యాయపరమైన పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.కుటుంబ సభ్యుల బాధ్యత గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.ఇతరులకు కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవద్దు.కాలాన్ని వృథా చేయొద్దు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.సంతానం నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం మంచిది.

కర్కాటకం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆరోగ్యంను జాగ్రత్తగా చూసుకోవాలి.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో అనవసరంగా గొడవలకు దిగకండి.

తులా:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో సలహాలు అందుకునే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చుతారు.దీనివల్ల లేని సమస్యలను కొని తెచ్చుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.లేదంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో అడ్డంకులు వస్తాయి.దీనివల్ల నిరాశ చెందుతారు.అనుకోకుండా మీ స్నేహితుడు కలవడం వల్ల మీ పనులు పూర్తవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకండి.తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

#Daily Horoscope #Jathakam #TeluguDaily #Thursday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU