తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 22, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 22 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.55

రాహుకాలం: ఉ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.సమయాన్ని వృథా చేయకూడదు.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీ స్నేహితులను కలుస్తారు.

మిథునం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించాలని కుతూహలం మీలో ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.సంతానం నుండి శుభవార్త వింటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త ఒత్తిడిగా లోనవుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదురవుతాయి.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు అనవసరమైన పనులను మొదలు పెట్టడం వల్ల సమయం మొత్తం వృథా అవుతుంది.ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులు కోల్పోతారు.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వదిలేస్తారు.

మకరం:

ఈరోజు మీరు తొందర పడడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం గురించి ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

అనవసరమైన విషయాలను ఎక్కువగా పట్టించుకోకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అది సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

#Daily Horoscope #Jathakam #TeluguDaily #Wednesday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU