తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 21, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 21 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.00

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 11.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కాస్త తీరిక లేని సమయం గడుపుతారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

వృషభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రుల తో చర్చలు చేయాలి.అనవసరమైన విషయాలలో ఎక్కువగా తలదూర్చకూడదు.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

బంధువుల నుండి శుభవార్త వింటారు.దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.

ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీని వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీని వల్ల లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.అనుకోకుండా కొన్ని దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

#TeluguDaily #Tuesday #Daily Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU