తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 20, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 20 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.00

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 07.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట పనులన్నీ త్వరగా పూర్తి అవుతాయి.

వృషభం:

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

మిథునం:

ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తిచేయడానికి గట్టి నిర్ణయం తీసుకుంటారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.సమయాన్ని కాపాడుకుంటారు.

సింహం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా చర్చిస్తారు.

కన్య:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తులా:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతానం నుండి శుభవార్త వింటారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి సమయాన్ని కేటాయించాలి.ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మకరం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.తీరికలేని సమయంతో గడుపుతారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపలేక పోతారు.ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

కుంభం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.ఇతరులకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట మంచి గౌరవం అందుతుంది.

#Jathakam #Monday #Daily Horoscope #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU