తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 18 శుక్రవారం, 2020

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.46AM.
సూర్యాస్తమయం: సాయంత్రం 05.57PM.
రాహుకాలం: సా.10.20PM నుంచి 11.51 వరకు.
అమృత ఘడియలు: రా 02.23 నుంచి 03.32 వరకు వరకు.
దుర్ముహూర్తం: ఉ 08.17 నుంచి 09.06 వరకు, తిరిగి 12.20 నుంచి 01.09 వరకు.

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 18 Sunday 2020-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఇబ్బంది కరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు.ఇంటి గుట్టు బయటపెట్టకూడదు.ఇతరుల సమస్యలను పరిష్కరిమచేందుకు ప్రయత్నించవద్దు.కుటుంబ సభ్యులతో సమస్యలు ఎదురుకావచ్చు.ఆర్ధికంగా ఇబ్బందులు పెరుగుతాయి.వ్యాపారవర్గాలవారు జాగ్రత్తగా వ్యవహరించాలి.

లేకపోతే నష్టాలు తప్పవు.ఈరోజు అద్భుతమైన సమాచారం అందుకుంటారు.

వృషభం:

కుటుంబ సభ్యులతో సఖ్యత మరింత పెరుగుతుంది.వివాహ, సంతాన, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.ఖర్చు విపరీతంగా ఉంటుంది.విలాసాలకు అధికంగా ఖర్చు పెట్టే అవకాశాలే ఎక్కువ.ప్రతి ప్రయత్నం సఫలమౌతుంది.ఐతే ధైర్యంగా, సాహసంతో, దైవనామ స్మరణతో ముందడుగు వేస్తె ఫలితాలుంటాయి.క్రయవిక్రయాల్లో లాభసాటిగా ఉంటుంది.

మిథునం:

నిర్లక్ష్యం మంచిది కాదు.రుణాలు అందినట్టే అంది చేజారి పోతాయి.చెడుకు దూరంగా ఉండండి.

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 18 Sunday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 18 శుక్రవారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనవసరవిషయాల్లో తలదూర్చడం మంచిది కాదు.కోపాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి.

దీనివల్ల కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.చెడు వార్తలు వినే అవకాశాలున్నాయి.ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి.

కర్కాటకం:

చాలా అద్భుతమైన రోజు.రుణ భారం తగ్గుతుంది.అవసరానికి దానం అందుతుంది.

బ్యాంకు రుణాలు చేతికొస్తాయి.సమాజంలో గౌరవం పొందుతారు.

ఉద్యోగ, శుభవార్తలు వింటారు.ప్రయాణం చేసే అవకాశముంది.

దూరమైన వారు దగ్గరవుతారు.భార్య భర్తలు, ప్రేమికుల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది .వివాదాల నుంచి బయటపడతారు.పలు కేసుల్లో ఉపశమన పొందుతారు.

వాహన, గృహ విక్రయాలకు మంచి రోజు.కష్టపడి చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు.

సింహం:

ఆర్ధిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి.దంపతుల మధ్య గొడవలు జరిగే అవకాశాలు అధికం.సంసారంలో సమస్యలుంటాయి.భవిష్యత్ అంశాలపై జాగ్రత్త అవసరం.నమ్మక ద్రోహం జరిగే అవకాశాలున్నాయి.కుటుంబంలో ప్రశాంతత కోల్పోతారు.చేదు స్నేహాలకు, వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండండి.

కన్య:

కన్యారాశి వారికి ఈ రోజు బాగా కలిసివస్తుంది.అమ్మకం,కొనుగోళ్లలో మంచి జరుగుతుంది.మంచివారితో పరిచయాలు భవిష్యత్తుకు మేలు చేస్తాయి.

బంధువులతో ఉల్లసంగా గడుపుతారు.ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

అత్యవసర ప్రయాణాలు చేయవచ్చు.శ్రమకు తాగ్గా ఫలితం ఉంటుంది.

ఉద్యోగస్తులకు మంచి రోజు.ఓర్పు, సహనంతో పనులు ప్రారంభిస్తే విజయం సిధ్ధిస్తుంది.

భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.విడిపోయినవారు కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

తులా:

ఇబ్బందికరమైన పరిస్టులను ఎదుర్కోవలసి వస్తుంది.మోసపోయే అవకాశాలున్నాయి.జారత్తగా వ్యవహరించండి.అధికంగా శ్రమ పడిన లాభం ఉండదు.ఇతరుల శ్రమపైన ఆధార పడటంవల్ల ఇబ్బందులు తప్పవు.ఆప్తులను దూరం చేసుకొనే అవకాశాలున్నాయి జాగ్రత్త.

తప్పుడు నిర్ణయాలతో సమస్యల్లో చిక్కుకుంటారు.మిలో ఉన్న చేదు ఇవాళ మీకు తీవ్ర నష్టానికి గురి చేస్తోంది.ఆశా దృక్పథంతో ముందడుగు వేయండి .

వృశ్చికం:

అన్ని అనుకూలంగా ఉన్నాయి.అనుకున్న పనిలో మంచి జరుగుతుంది.కష్టాల నుంచి బయటపడతారు, ధైర్యముగా ముందడుగు వేయండి.

మంచి జరుగుతుంది.వారసత్వంగా అందే ఆస్తులు చేతికొస్తాయి.

రుణాలు కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు కలసి వస్తుంది.క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.శుభవార్త వింటారు.

ధనస్సు:

అనుమానాలు, సందేహాలు మీ దరి చేరణీయకండి.మీ సందేహ స్వభావం, మిమ్మల్ని ఓటమి దిశగా తీసుకువెళ్తుంది.భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈ రోజు మంచిఫలితాలు అందుతాయి.

వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం లాంటివి మానండి.ప్రేమ లోకంలో మునిగి తెలుతారు.

సృజనాత్మకత గల పనులలో నిమగ్నమవ్వండి.మీకు సరైనవారు కాదు మీ సమయము పూర్తిగా వృధాఅవుతోంది అని భావిస్తే అలాంటి కంపెనీలను వ్యక్తులను విడిచిపెట్టండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి.

మకరం:

ఆరోగ్యాన్ని కాపాడుకోండి.ఈ రోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉండండి.చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు ఈ రోజు మీ చేతికి అందుతాయి.

వయసు మీరిన ఒకరి అనారోగ్యం మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది.మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనున్నారు.

ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి.మీకు కావాలనుకున్న పనులు చెయ్యమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి.

మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి అని తృప్తి పడడమే మంచిది.మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడు దిగుళ్ల తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి మీకిదో బంగారు రోజు.

కుంభం:

సంతానం లేదా ఇంట్లోని పెద్దల ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవతంపై ప్రభావాన్ని నేరుగా మీకు ఆందోళన కలగించవచ్చు .పొదుపుచేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు.అయినప్పటికీ మీరు దిగులుపడాల్సిన పనిలేదు.ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు.మీకు బాగా అవసరమైన వేళలో మీ స్నేహితులు మిమ్మల్ని నిరాశకు గురిచేసి, అందుబాటులో లేకుండా పోవచ్చు.మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనతో జీవిత కాల బంధం కావచ్చు .ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు.భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చు .మీరు మీ సమయాన్ని స్నేహితులతో గడపాలనుకున్నా మత్తుపానీయాలనుండి దూరంగా ఉండండి.జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు.

మీనం:

ఆరోగ్యాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేయండి.యోగా, ధ్యానం, వాకింగ్ లాంటివి చేయండి.ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు.మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి వుంటే మీరు వారి నుండి ఈ రోజు మీ డబ్బుని తిరిగి పొందగలరు.మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్నా ఈ రోజు పూర్తయేలోపు వారు కేవలం మీకు కావాల్సినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడిపారన్న అసలు విషయాన్ని మీరు గ్రహిస్తారు.

#Daily Horoscope #Jathakam #TeluguDaily #September18

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU