తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -సెప్టెంబర్ 17, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 17 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.00

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 09.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.

కొత్త పనులు ప్రారంభిస్తారు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు కూడా చేయకండి.

ఇతరులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు అదుపులో ఉండాలి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.ఇతరుల సహాయం అందుకుంటారు.

సింహం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

తులా:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.ఈరోజు కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా పొదుపు చేయాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కాని అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

కుంభం:

ఈరోజు మీరు మీ సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుతారు.అనవసరంగా వాదనలకు దిగకండి.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

#Friday #Jathakam #Daily Horoscope #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU