ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.51సూర్యాస్తమయం: సాయంత్రం 06.01రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకుఅమృత ఘడియలు: ఉ.9:47 నుంచి 11:20 వరకు వరకుదుర్ముహూర్తం: ఉ.11.31 నుంచి 12.20 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

గతంలో చేసిన అప్పులు తీర్చేస్తారు.ఈరోజు వ్యాపారాల్లో భారీ పెట్టుబడులు పెడుతారు.బయటకు వెళ్లిన సమయంలో ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.
బంధువుల నుంచి శుభవార్త అందుతుంది.ఈరోజు అంత ఎంతో సంతోషంగా ఉంటారు.
వృషభం:

ఉద్యోగంలో ఈరోజు ఫుల్ బిజీ బిజీ ఉంటుంది.ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న అప్పులు తిరిగి వసూలు అవుతాయ్.ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటుంది.వైవాహిక జీవితంలో అద్భుతమైన రోజు కానుంది.
మిథునం:

జీవిత భాగస్వామితో భవిష్యేత్తు గురించి మాట్లాడుతారు.ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవుతాయ్.డబ్బును చూసి ఖర్చు చేసుకుంటే మంచిది.కొన్ని విషయలు చికాకు తెప్పిస్తాయ్.ధ్యానం చేసుకోవడం మంచిది.
కర్కాటకం:

ఈరోజును ధ్యానంతో ప్రారంభిస్తే ప్రశాంతంగా అవుతుంది.ఏదైనా పని చేసినప్పుడు ఆనందంగా చెయ్యాలి.పిల్లల చదువు కోసం ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తారు.
కొన్ని విషయాల్లో ఒత్తిడికి గురవుతారు.జాగ్రత్త.
సింహం:

ఎంత కోపం వచ్చిన పక్కవారితో మాట్లాడే సమయంలో చిరునవ్వుతోనే మాట్లాడండి.దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి బయటపడడం మంచిది.ఆఫీసులో సహా ఉద్యోగుల సపోర్ట్ కారణంగా ఆనందంగా గడుపుతారు.మీ జీవిత భాగస్వామితో మీరు మంచి సమయాన్ని గడుపుతారు.
కన్య:

వ్యాపారాల్లో పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడం మంచిది.ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాయిదా వెయ్యండి.మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.మీకు రోజు మొత్తం మంచి ఫలితాన్ని ఇస్తుంది.ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపనున్నారు.
తులా:

ఈరోజు శ్రమతో కాకుండా బుద్ధి బలంతో పని చెయ్యాల్సి ఉంటుంది.మానసికంగా వేధిస్తున్న సమస్యలకు ఆలోచనతో పరిష్కరించాలి.ఖాళీ సమయంలో దొరికితే పుస్తకాలు చదవడం లేదా కుటుంబసభ్యులతో గడపడం చెయ్యండి.ఈరోజు కొన్ని వార్తలు మిమ్మల్ని బాదలోకి నెట్టేస్తాయ్.
వృశ్చికం:

మీ స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది.ఏదైనా విషయంలో విజయం సాధించాలంటే కాలంతో సరికొత్త ఆలోచనలతో ముందడుగు వెయ్యాలి.ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తే తల్లితండ్రులు లేదా మీ ఇంట్లోవారి సలహా తీసుకోవడం ఎంతో మంచిది.
ధనస్సు:

మనశాంతి లేకుండా చేస్తున్న సమస్యల్ను పరిష్కరించగలరు.ఏదైనా పొదుపు స్కీమ్స్ లో డబ్బు పెడితే మంచిది.మీ పిల్లలు మంచి చదువుతో మిమ్మల్ని ఆనందపరుస్తారు.వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి.అధిక కర్చులు చేస్తారు.జాగ్రత్త.
మకరం:

మీ సమస్యలు ఇతరులతో పంచుకోవడం మంచిది.ఎవరైనా సహాయం అడిగితే చేయడం మంచిది.అప్పు అడిగితే అసలు ఇవ్వకుండా ఉంటే మంచిది.ఇంట్లోని ఒత్తిడి కారణంగా మీరు ఇబ్బందులకు గురవుతారు.వ్యాపారానికి సంబందించిన కొన్ని విషయాలు మిమ్మల్ని బాధపెడుతాయ్.
కుంభం:

ఉద్యోగంలో మీ అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు.ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.ఈరోజు అనుకోని ప్రయాణాలు చేస్తారు.వైవాహిక జీవితంలో కొన్ని చికాకులు ఎదురవుతాయ్.
మీనం:

వ్యాపారాల్లో భారీగా లాభాలు ఉంటాయ్.తల్లితండ్రులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు.పాత మిత్రులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు.
బంధు మిత్రుల నుంచి అనుకోని శుభవార్త వింటారు.

DEVOTIONAL