తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 15, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 15 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.00

రాహుకాలం: ఉ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.03.00 నుంచి 04.30 వరకు

దుర్ముహూర్తం: నవమి ,ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వ్యాపారస్తులు మరింత అభివృద్ధి కోసం ఆలోచిస్తారు.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాలు ఎక్కువగా పట్టించుకోకూడదు.ఇతరులు మిమ్మల్ని విమర్శిస్తారు.

వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఆర్థికంగా పొదుపు చేయాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.కొన్ని కొత్త పనులలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.ఈరోజు సమయాన్ని కాలక్షేపం చేయకూడదు.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అయినా కూడా వాటిని తట్టుకునే శక్తిని మీలో ఉంటుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు కొన్ని పనులలో మంచి విజయాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

తులా:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు తొందర పడకూడదు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.సమయాన్ని కాపాడుకుంటారు.సొంత నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.మానసిక ఒత్తిడి నుండి బయట పడతారు.

ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

మకరం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సంతానం నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.సమయాన్ని వృథా చేయకూడదు.

కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీకు సమాజంలో మంచి గౌరవం అందుతుంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

ఈరోజు మీకు ఒత్తిడి గా ఉంటుంది.

#Wednesday #TeluguDaily #Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL