తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 12, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 12 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.11

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: విశాఖ, షష్టి సామాన్యం మ.03.00 నుంచి 04.30 వరకు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల సమస్యలను పరిష్కరిస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుభవమున్న వ్యక్తులతో చర్చలు చేయడం చాలా అవసరం.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం సమస్య పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని ఎదుర్కొంటారు.ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

కన్య:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన విషయాలను అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఆర్థిక లాభాలు ఉన్నాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.

కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు నోరు జారడం వల్ల వాదన జరుగుతుంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

ధనస్సు:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ఈరోజు సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉంటాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు తొందర పడక పోవడం మంచిది.

కుంభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబసభ్యుల సలహాలు మీకు సంతృప్తినిస్తాయి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.ఈరోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

ఓ శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube