తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 9 శుక్రవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 9 Friday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.40

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.56 నుంచి 10.53 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.15 నుంచి 09.02 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు మీ తోబుట్టువుల నుండి సహాయము పొందుతారు.మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.శారీరకంగా  చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కొత్త విషయాల గురించి ఈ రోజు అనుకూలంగా ఉంది.ఒక ఉత్సాహ సంఘటన వల్ల మీకు రిలీఫ్ దొరుకుతుంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

వృషభం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నా మీరు డబ్బులు పొదుపు చేయలేకపోతున్నారు.తీరిక లేకుండా పనిచేయడం వల్ల మీ కల నెరవేరుతుంది.మీ స్నేహితుల నుంచి  సలహాలు అందుకుంటారు.

వ్యాపారం కోసం వేసుకున్న ప్లాన్ ఫలిస్తుంది.ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.ఇతరులతో గడపడానికి అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్త పడండి.మీ స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చదువు పై దృష్టి చూపించట్లేదు.అతిగా ఖర్చుల వల్ల మీ భాగస్వామితో గొడవలు జరుగుతాయి.

కర్కాటకం:

ఈరోజు మిమ్మల్ని ఒకరు ఆర్థిక సహాయం  అడుగుతారు.మీరు మీ విషయంలో ఇతరులను నమ్మవద్దు.ఏదైనా కొత్త విషయాలు ఆలోచించడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండండి.అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీ ఆరోగ్యాన్ని నుండి కోలుకుంటారు.ఈ రోజు ఒక వార్త మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది.దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు.

మీరు పనిచేసే చోట మిమ్మల్ని ఒకరు నమ్మకద్రోహం చేస్తారు.దీనివల్ల విచారంగా ఉంటారు.మీ జీవిత భాగస్వామి నుండి అద్భుతం గా గడుస్తుంది.

కన్య:

ఈరోజు మీరు అప్పులు చేసి తిరిగి ఇచ్చేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు.చాలా రోజులనుంచి బాధపడుతున్నా ఆరోగ్య సమస్యలు నుండి విముక్తి పొందుతారు.కొన్ని శుభ వార్తలు వింటారు.

దీంతో సంతోషంగా ఉంటారు.సమస్యల ను ఎదుర్కొని మంచి గుర్తింపు పొందుతారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.వాయిదా లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

ఈరోజు సంతోషంగా గడుపుతారు.కొన్ని సంఘటనలు అయోమయం లో పడేలా చేస్తాయి.

అంతేకాకుండా అలసిపోయేలా చేస్తాయి.మీ జీవిత భాగస్వామి తో మంచి సమయం గడుపుతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేయటం వల్ల  ఆర్థికంగా నష్టాలు వస్తాయి.శ్రద్ధగా లేనందున కొన్ని నష్టాలు ఎదురవుతాయి.ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.ఈరోజు మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.మీ జీవిత భాగస్వామి తరఫున కొన్ని ప్రవర్తనలు మీపై ప్రభావం చూపుతాయి.

ధనస్సు:

ఈరోజు మీ తోబుట్టువుల నుండి  సహాయం  అందుతుంది.ఈరోజు మీ తోటి ఉద్యోగితో సమయం గడుపుతారు.మీ జీవితంలో అన్ని ఒక వైపు ఉంటే మీ ప్రేమ జీవితభాగస్వామిపై ఉంటుంది.

ఇతరులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు కొత్త ఆలోచనలు వస్తాయి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మకరం:

ఈరోజు మీరు ఏదైనా వ్యాపారంలో  లో  ఒప్పందాలు  చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండండి.మీరు పనిచేసే చోట వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేయండి.డబ్బు విషయంలో బంధాలను పోగొట్టుకోకూడదు.మీ తెలివితేటలు వల్ల కొన్ని లాభాలు వస్తాయి.మీ ఆలోచనల తోనే బలాన్ని దక్కించుకుంటారు.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా సమస్య ఎదురవుతుంది.పనిచేసే చోట నీర సత్వం చూపించకుండా చేయాలి లేకుంటే ఆర్థిక నష్టాలు వస్తాయి.ఆఫీసులో ఇతరులతో రాజకీయం లాంటివి చేయకూడదు.

ఈ విధంగా ఆఫీస్ లో  మీదే పైచేయి ఉంటుంది.ఈరోజు మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది.

మీనం:

ఈరోజు ఆర్థికంగా  ఇబ్బందిలో ఉండగా మీరు మీ స్నేహితుల నుండి ధనాన్ని అప్పుగా తీసుకుంటారు.ఇతరులతో ఉన్నప్పుడు ఏదైనా విషయాలపై ఆలోచించి మాట్లాడండి.మీరు అందుకున్న విజయాలు ఇతరులు పొగడటం తో ఆనందంగా ఉంటారు.వైవాహిక జీవితంలో  కొన్ని పరిణామాలను చూడాల్సి ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube