ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.05
సూర్యాస్తమయం: సాయంత్రం 05.37
రాహుకాలం: ఉ.09.08 నుంచి 10.41 వరకు
అమృత ఘడియలు: ఉ.07.40 నుంచి 08.05 వరకు
దుర్ముహూర్తం: ఉ.06.06 నుంచి 06.51 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మేషరాశి వారికి పరిపూర్ణమైన రాజ యోగం ఉంటుంది.సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.ఈ రాశివారు ఈ రోజు కొత్త కాంట్రాక్టులను ప్రారంభిస్తారు.
ఈ రాశి వారు ఈ రోజు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, కొంతమేర ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ రాశి వారికి అదృష్టం 86 శాతం మద్దతు తెలుపుతుంది.
వృషభం:

ఈ రోజు వృషభ రాశి వారు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసేవారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంది.వృషభ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా గడుపుతారు.ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం 86 శాతం కలిసి వస్తుంది.
మిథునం:

ఈ రోజు మిధున రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.విద్యార్థులు వారు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఈ రాశి వారికి వారి కుటుంబ సభ్యుల నుంచి చేదు వార్తను వింటారు.ఈ రాశి వారికి 82 శాతం అదృష్టం కలిసి వస్తుంది.
కర్కాటకం:

ఈరోజు రాజకీయ నాయకులకు ఎంతో ఉత్తమమైన ఫలితాలు కలిగే సూచనలున్నాయి.ఈ రాశి వారి ఈరోజు వారు కోల్పోయిన వస్తువులను తిరిగి పొందుతారు.ఈ రాశివారు వారి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.రోజు వారి వ్యాపారాలలో లాభాలను పొందుతారు.ఈ రాశి వారికి 55 శాతం అదృష్టం కలిసి వస్తుంది.
సింహం:

సింహరాశి వారికి వ్యాపారంలో ప్రత్యర్థులు తీవ్ర తలనొప్పిగా మారుతారు.వ్యాపారంలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.విద్యార్థులకు విజయం లభిస్తుంది.
ఈ రాశివారు విదేశాల నుంచి శుభవార్త లను వింటారు.ఈ రోజు ఈ రాశి వారికి 85 శాతం మద్దతు తెలుపుతుంది.
కన్య:

ఈ రాశివారు ఎంతోకాలంగా వ్యాపార రంగంలో ఏర్పడే గందరగోళం ఈ రోజుతో ముగుస్తుంది.ఇతరులకు రుణాలు ఇవ్వడం మానుకోండి.సామాజిక పనుల కోసం చేసి ప్రయాణాలు సాధ్యమవుతాయి.ఈ రాశివారు స్నేహితులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.మీ రాశి వారికి 86% అదృష్టం కలిసి వస్తుంది.
తులా:

ఈ రాశివారికి ఉపాధిలో ఆదాయం పెరుగుతుంది.ఫలితంగా మనకున్న విజయాన్ని చేరుతారు.ఆధ్యాత్మిక పనుల్లో పలుకుబడి పెరుగుతుంది.కుటుంబం నుంచి వారసత్వ ఆస్తి పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు తులారాశి వారికి 85 శాతం అదృష్టం వరిస్తుంది.
వృశ్చికం:

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు.ఈ రాశి వారు ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో బిజీగా గడుపుతారు.నూతన వ్యక్తులను కలుస్తారు.
వ్యాపారంలో ఖర్చులు పెరుగుతాయి.ఈ రాశి వారు ఈ రోజు వీలైనంత వరకు గొడవలకు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం 80 శాతం కలిసి వస్తుంది.
ధనస్సు:

ఈ రాశి వారికి ఈ రోజు సహోద్యోగుల నుంచి ఎంతో మద్దతు లభిస్తుంది.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.అతిథులు రాకతో ఈ రాశి వారు ఈ రోజు ఎంతో ఆనందం గడుపుతారు.
తండ్రి మార్గదర్శకత్వం లోనే నడిచి వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తారు.కుటుంబంలో కలహాలు తొలగి పోయి ఎంతో ఆనందంగా గడుపుతారు.ఈ రాశి వారికి 84 శాతం అదృష్టం కలిసి వస్తుంది.
మకరం:

ఈ రాశివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు మానసిక పరిస్థితి మెరుగ్గా ఉండడంతో ఆగిపోయిన పనులను పూర్తి చేసుకుంటారు.మీరు ఎంచుకున్న రంగంలో ఆనందం పొందుతారు.కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉండటం వల్ల ఎంతో ఆనందంగా గడుపుతారు.ఈ రాశి వారికి 86 శాతం అదృష్టం కలిసి వస్తుంది.
కుంభం:

ఈ రాశివారు ఈరోజు అన్ని పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తారు.రాజకీయాలకు సంబంధించిన పనులలో మీకు విజయం లభిస్తుంది.భూమి, వాహనాలను కొనుగోలు చేయటం ద్వారా ఆనందం పొందుతారు.
జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయం.ఈరోజు మీకు 55 శాతం అదృష్టం కలిసి వస్తుంది.
మీనం:

ఈ రాశివారు వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతూ కుటుంబ అవసరాలను అర్థం చేసుకుంటారు.ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.సహచరుల నుంచి విద్యార్థులు సహాయం అందుకుంటారు.ఈరోజు అదృష్ట 86 శాతం మీకు కలిసి వస్తుంది.
DEVOTIONAL