ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.03
సూర్యాస్తమయం: సాయంత్రం 05.39
రాహుకాలం: మ.02.52 నుంచి 04.15 వరకు
అమృత ఘడియలు: ఉ.07.35 నుంచి 08.15 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.23 నుంచి 09.09 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.మీ భాగస్వామి సహకారంతో విజయం సాధిస్తారు.సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.
కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు.సాధ్యమైనంత వరకు గొడవలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
వృషభం:

ఈ రోజు ఈ రాశి వారికి అన్నీ శుభాలే జరుగుతాయి.ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు.నూతన ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది.కాంట్రాక్టుల ద్వారా మీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది.రాజకీయం రంగంలో ఉన్న వారు తమ పనులు పూర్తవుతాయి.అధికార పాలన నుంచి మంచి ప్రయోజనం పొందుతారు.సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.
మిథునం:

ఈ రాశి వారికి ఈ రోజు అంత కలిసిరాదు.తమ విలువైన వస్తువును కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.
అలాగే విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు.దీంతో మీరు ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.
పెండింగ్ లో ఉన్న పనునలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించుకుంటారు.చేపట్టిన పనులను విజయ వంతంగా పూర్తి చేస్తారు.
కర్కాటకం:

కర్కాటక రాశి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది.అన్ని పనుల్లో వారే విజయం సాధిస్తారు.మీరు చేసే రంగంలో పురోగతిని సాధిస్తారు.మీ పిల్లలపై ఎక్కువ బాధ్యతలను తీసుకుంటు వారి ఎదుగుదలకు సహాయపడతారు.అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఈ ప్రయాణాల వలన మీరు ప్రయోజనం పొందుతారు.మీ ప్రియమైన వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు.
సింహం:

ఆర్థికంగా మీకు ప్రయోజనాలను అందుకుంటారు.ఈ రోజు ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది.ఆదాయ వనరులను సృష్టించుకుంటారు.
మీ వాక్ చాతుర్యం ద్వారా ఇతరుల నుంచి గౌరవం పొందుతారు.విద్యా రంగంలో విజయం సాధిస్తారు.
కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.మీ ప్రత్యర్థులతో సమానంగా పోటీ పడతారు.
కన్య:

ఈ రోజు కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి.అంతేకాకుండా ఉపాధి, వ్యాపార రంగంలో కొనసాగుతున్న ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు.సంతానం విషయంలో శుభవార్త వింటారు.చట్టపరమైన వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు.ఖర్చు పెరుగుతుంది.అలాగే కీర్తిని కూడా పొందుతారు.కుటుంబ శ్రేయస్సుకు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారు
తులా:

ఈ రోజు తులా రాశి వారికి అనుకూల ఫలితాలు పొందాతారు.కుటుంబంతో ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.దాంతో కుంటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటున్న సమస్య నుంచి ఈ రోజు ఉపశమనం పొందుతారు.స్నేహితుల రాకతో మీరు ఆనందంగా ఈ రోజంతా గడుపుతారు.అనుకోకుండా సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి.
వృశ్చికం:

ఈ రోజు వృశ్చిక రాశి వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.ఆరోగ్యం గురించి చింతిస్తారు.గాలి, మూత్రం వంటి అంతర్గత ఆరోగ్య సమస్యల కారణంగా ఆందోళన చెందుతారు.అనారోగ్యం మిమ్మల్ని బాధ పెడుతుంది.కొన్ని రోజుల వరకు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది.
ధనస్సు:

ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది.మీ పనితనం మూలంగా మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు.పార్టీల నుంచి కొంత లాభం పొందవచ్చు.
అత్తమామల ద్వారా తమకు రావాల్సినవి అందుకుంటారు.సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి.స్నేహితులను కలవడం వలన ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.
మకరం:

కుటుంబ, ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.మీ ఉపాధి రంగంలో మీరు అనుకున్న విజయాన్ని సొంతం చేసుకుంటారు.మీ సహ ఉద్యోగుల నుంచి గౌరవం పొందుతారు.
వారి నుంచి మద్దతును కూడా పొందుతారు.మీ అభిప్రాయాలకు ప్రజలు ఏకీభవిస్తారు.
వివాదాల్లో చిక్కుకునే అవకాశాలున్నాయి.తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది.
కుంభం:

ఈ రోజు ఈ రాశి వారి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కొన్ని పనుల కారణంగా మీ శరీరక నొప్పులు కలగవచ్చు.శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.మీ అతి తెలివితేటలతో మీ పనిలో నిరాశ, నష్టాలు కలగవచ్చు.అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.సాధ్యమైనంత వరకు గొడవలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మీనం:

ఈ రోజు ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు.తల్లిదండ్రులు తమ సంతానం గురించి చింతిస్తూ రోజంతా గడుపుతారు.అత్తామామలతో ప్రేమపూర్వకంగా ఉండటం మంచిది.అనుకోకుండా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.మీ ప్రయాణాల పట్ల కొంచం జాగ్రత్త వహించడం మంచిది.అనవసర ఖర్చులు చేయాల్సి వస్తుంది.
అందుకుని అవసరమైన వరకు దుభార ఖర్చులను తగ్గించుకుంటే మంచిది.
DEVOTIONAL