తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 25, సోమవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 25 Monday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.56

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 25 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు చికాకులు ఎదుర్కొంటారు.దీనివల్ల సంతోషాన్ని కోల్పోతారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.పిల్లల పెళ్లిళ్ల గురించి ఆలోచిస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఎటువంటి ఆందోళన చెందకూడదు.జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

ఈరోజు మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.అందరితో సంతోషంగా గడుపుతారు.ఆరోగ్యం బాగానే ఉంది.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఈరోజు ఆనందంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు.కుటుంబ సభ్యులతో గొడవలకు దిగే అవకాశం ఉంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.

అప్పుగా ఇచ్చిన వాళ్లు గొడవలు చేసే అవకాశం ఉంది.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.పిల్లల విషయంలో కొన్ని గొడవలకు దిగుతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీరు ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశం ఉంది.దీనివల్ల బాగా చింత చెందుతారు.ఈరోజు మీకు సమయం అనుకూలించదు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా కొన్ని పరిచయాలు ఏర్పడి మంచి బంధాన్ని కలిగిస్తాయి.

తులా:

ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కాబట్టి అనుభవమున్న వ్యక్తులతో మీ ముఖ్యమైన విషయాల నిర్ణయాలు తీసుకోవాలి.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల మనసు కాస్త ఉత్సాహంగా ఉంటుంది.ఆరోగ్యంను జాగ్రత్తగా చూసుకోవాలి.పిల్లలు పెళ్లిళ్ల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

ఇతరులు మీ సొమ్మును తీర్చడంలో ఆలస్యం చేస్తారు.దీనివల్ల కాస్త నిరుత్సాహ పడతారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.పిల్లల నుండి శుభవార్త వింటారు.

సమయాన్ని కాలక్షేపం చేయకూడదు.భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

#Jathakam #TeluguDaily #Daily Horoscope #Monday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube