తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 22 గురువారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.01

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 22 Thursday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.42

రాహుకాలం: మ.01.50 నుంచి 02.54 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 22 Thursday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 22 గురువారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.07.35 నుంచి 08.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.09.55 నుంచి 10.42 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీ ఇంట్లో వాళ్లందరూ సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు తమ వ్యాపారంలో కొత్త మార్పులు సంభవిస్తాయి.ఈ మార్పు మీకు ప్రయోజనాలను ఇస్తుంది.

ఈ రాశి వారు సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి.ఆరోగ్యం పై నిర్లక్ష్యం వహిస్తే ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

వృషభం:

ఈ రాశి వారికి ఈ రోజు సమస్యలు వస్తాయి.అందువల్ల మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.ఈ రోజు మీరు అడగడుగునా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇరుగు పొరుగు వారు మీ పనుల్లో సహకరిస్తారు.

మిథునం:

కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా విజయం లభిస్తుంది.ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన శుభవార్త వింటారు.నూతన పెట్టుబడులు ప్రారంభిస్తారు.ఈ రంగం వారికి ప్రత్యేక గౌరవం లభిస్తుంది.కుటుంబంతో విడిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది.ఈ సమయంలోనే ఓపికగా ఉండాలి.తొందరపాటు నిర్ణయాలతో బాధ పడతారు.

కర్కాటకం:

ఈ రాశి వారు ఈ రోజు చాలా కార్యకలాపాల్లో పాల్గొంటారు.ఇతరుల లోపాలను వెతకడం గురించి మరిచి పోతే అభివఈద్ధి దిశగా వెలతారు.వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండటం మంచిది.

సింహం:

ఈ రాశి వారు ఈ రోజు డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు.అంతేకాకుండా పేదలకు సాయం కూడా చేస్తారు.మాట కారి తనంతో అవతల వ్యక్తిని ఆకర్షించగలుగుతారు.ఇంటి సభ్యులతో ఆనందంగా గడుపుతారు.అలాగే పనుల్లోనూ ఆసక్తి ని చూపెడుతారు.

కన్య:

ఈ రాశి వారు ఈ రోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఖర్చులు చేస్తారు.వారు అలా చేయాలని కోరుకోకపోయినా బలవంతంగానైనా చేస్తారు.ఈ రోజు వీరి దగ్గర డబ్బు నిలిచిపోతే మళ్లీ డబ్బు అందుకోలేరని భావించి ఖర్చు చేస్తారు.

తులా:

కుటుంబం నుంచి శుభవార్తలు వింటారు.బాధ్యతగా పనిచేసే వారికి మంచి పేరు, హక్కులు పెరుగుతాయి.అలాగే బాధ్యత కూడా పెరుగుతుంది.చేపట్టిన పనులు పూర్తిచేస్తారు.ప్రారంభించే వ్యవహారాల్లో విజయాన్నిసాధిస్తారు.

వృశ్చికం:

ఈ రాశి వారు కొన్ని గ్రహాల కారణంగా కడుపు, గాలి సంబంధిత సమస్యలతో బాధపడి ఆస్పటల్ల పాలయ్యే అవకాశాలున్నాయి.ఈ రాశి వారు కోపం అధికంగా చూపిస్తారు.సాయంత్రం కొన్ని శుభవార్తలు వచ్చి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి.ఈ రోజు మీకు శుభకార్యాలకు, వేడుకలకు వెలతారు.

ధనస్సు:

మీ మనస్తత్వాన్ని ఇతరులకు వెల్లడించకపోతే స్థిరమైన డబ్బును పొందుతారు.బృహస్పతి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.కాబట్టి ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

మకరం:

ఈ రాశి వారు పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు.చేపట్టిన పనులను విజయవంతంగా ముగిస్తారు.విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.అందుకు మీరు ఓపికగా ఎదురుచూడాలి.భాగస్వామ్యం విషయాల్లో ప్రయోజనం పొందుతారు.

కుంభం:

ఈ రోజు మీకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.మీ పై అధికారుల సాయంతో పురోగతి పొందుతారు.చేపట్టిన పనులను పెద్దల ఆశీర్వాదంతో విజయం సాధిస్తారు.వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండటం మంచిది.

మీనం:

ఈ రోజు ఏ పని చేసినా పూర్తి కాదు.తమ భాగస్వామి పట్ల ప్రేమను చూపిస్తారు.పదోన్నతులు పొందే అవకాశం ఉంది.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా అతిథులు రావడం వల్ల కొంచెం అసౌకర్యంగా గడుపుతారు.

#TeluguDaily #Daily Horoscope #Jathakam #October22

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU