తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 20, బుధవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 20 Wednesday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.55

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 20 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.దీని వల్ల కాస్త అనుకూలంగా ఉంటుంది.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థిక లాభాలు ఉన్నా కూడా కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధ పెడతాయి.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులు ఉద్యోగ కోసం ప్రయత్నించాలి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.కొన్ని కొత్త పరిచయాలు మంచి బంధుత్వాన్ని ఏర్పరుస్తాయి.ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

శత్రువులకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.లేదంటే మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

తులా:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ పాత స్నేహితులు కలవడం వల్ల వారితో సమయాన్ని గడపలేకపోతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆ పనులు వాయిదా పడుతుంటాయి.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.కుటుంబ సభ్యులతో అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకండి.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈరోజు ఓ శుభవార్త వింటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

మీనం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

#Jathakam #Wednesday #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube