తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 12 మంగళవారం 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.59

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 12 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.48

రాహుకాలం: మ.03.00 నుంచి 4.03

అమృత ఘడియలు: ఉ.07.10 నుంచి 07.40వరకు సాయంత్రం 05.15 నుంచి05.50వరకుదుర్ముహూర్తం: ఉ08.21- 09.08 వరకు తిరిగి రాత్రి 10.40- 11.29 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Raasi Phalal

ఈ రాశివారు కుటుంబ సభ్యులకు సంబంధించి శుభవార్తలు వింటారు.కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతూ ప్రయాణాలు చేస్తారు.అయితే ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో తొందర పడకుండా కాస్త ఆలోచన చేయాల్సి ఉంటుంది.తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Raasi Phalal

వృషభ రాశి వారికి ఈ రోజు ఆదాయాలు మెండుగా ఉన్నాయి.అయితే వీలైనంతవరకు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా వివాదాలకు వెళ్లకుండా ఉండటం మంచిది.మీరు చేసే ముఖ్యమైన పనుల గురించి కుటుంబ సభ్యులతో చర్చించడం ఎంతో మంచిది.వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Raasi Phalal

మిధున రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది గత కొద్ది రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న పనులు నేటితో పూర్తి అవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతారు.చిరకాల మిత్రుల కలయికతో ఈ రోజు మిధున రాశి వారికి సంతోషంగా గడపడమే కాకుండా కొంతమేర డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఈ రాశి వారు వీలైనంతవరకు ఈరోజు ఎవరి విషయంలో కలుగజేసుకొని ఉండా దూరప్రయాణాలు చేయకుండా ఉండటం ఎంతో మంచిది.వ్యాపారాలు పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Raasi Phalal

సింహ రాశి వారికి నేడు ఎంతో అనుకూలంగా ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఈరోజు ఎంతో అనువైన సమయం.ముఖ్యమైన పనుల నిమిత్తం ఈ రాశివారు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మిత్రుల సలహాలు సూచనల మేరకు మంచి నిర్ణయాలను ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది

కన్య:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Raasi Phalal

ఈ రాశి వారికి నేడు ఇతరులతో గొడవపడే సూచనలు కనపడుతున్నాయి.అందుకే ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.లేనిపోని విషయాలలో కలుగజేసుకోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.వీలైనంతవరకూ అనవసర విషయాలలో తల దూర్చకండి.ఇతరులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది.

తులా:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Raasi Phalal

తులారాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.గత కొన్ని రోజుల నుంచి వాయిదాపడిన పనులను పూర్తి చేయడంతో పై అధికారుల చేత ప్రశంసలు పొందుతారు.ఈ క్రమంలోనే సరి కొత్త పనులకు శ్రీకారం కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళతారు.కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Raasi Phalal

ఈ రాశి వారికి నేడు ఎంతో అనుకూలంగా ఉంది.కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న వ్యాపార విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి నేడు ఎంతో అనువైన సమయం.అయితే ఇతరుల నిర్ణయాలు కాకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిది ఇతరులను నమ్మి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల లాభాలను పొందే సూచనలు కనబడుతున్నాయి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Raasi Phalal

ఈ రాశి వారు ఈ రోజు ఎంతో బిజీగా కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు విహార యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి.వీలైనంత వరకు ఈ రాశివారు ఏ విధమైనటువంటి వాదనలకు దిగకపోవడం మంచిది.

మకరం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఇతరుల నుంచి రావాల్సిన పాతబాకీలు రాకపోవడంతో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనబడుతున్నాయి.ఈ విషయంపై కుటుంబంలో విభేదాలు కలహాలు వస్తాయి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.అయితే ఆరోగ్య విషయంలో ఈరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండటం అవసరం.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Raasi Phalal

కుంభ రాశి వారు ఈ రోజు ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో జాగ్రత్త అవసరం.ఇతరులతో గొడవలు పడే సూచనలు కనబడుతున్నాయి.అనుకోని ఆదాయం కలిసివస్తుంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు శుభకార్యాలలో పాల్గొంటారు.పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Raasi Phalal

మీన రాశి వారు నేడు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడం ఎంతో మంచిది.ఈ రాశివారు ఎక్కువగా ఇతరుల విషయాలలో కలుగజేసుకోవటం ఎంతో మంచిది.కొన్ని ఆరోగ్య పరమైన సమస్యలతో బాధ పడాల్సి ఉంటుంది.

ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందడుగు వేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube