తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -నవంబర్ 9, మంగళవారం , 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.03

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 9 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.24

రాహుకాలం: ఉ.3.00 ల4.30

అమృత ఘడియలు: ఉ.11.00ల12.00,సా.4.40ల6.40

దుర్ముహూర్తం: ఉ.8.24ల9.12,ప.10.46ల11.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకుండా ఉండటం మంచిది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.సమయం అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సమయాన్ని వృధా చేయకూడదు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.ఈరోజు ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేసే అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరుల మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండవు.దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేయడం మంచిది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

తులా:

ఈరోజు మీరు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఎక్కువ నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.స్నేహితులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోండి.దీనివల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చలు చేయాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీకు ఇతరుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాలలో లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం:

ఈరోజు మీకు సమాజంలో మంచి గౌరవం అందుతుంది.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube