తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 6 శుక్రవారం, 2020

Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 6 Friday 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.07

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 6 Friday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.35

రాహుకాలం: ఉ.10.42 నుంచి 12.04 వరకు

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 09.37 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.25 నుంచి 09.11 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు సంతోషకరంగా ఉంటారు.ఇప్పటి వరకున్న కష్టాలనుంచి విముక్తి లభిస్తుంది.వ్యాపార విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి.

అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

వృషభం:

ఈ రోజు మీకు పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి.అనుకోని అతిథులు మీ ఇంటికి వచ్చే అవకాశాలున్నాయి.మీ కుంటుంబం అంతా ఈ రోజు ఆనందంగా గడుపుతారు.కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.ఈ రోజు మీకు అన్ని అనుకున్నవి నెరవేరుతాయి.

మిథునం:

మీరు ఎంచుకున్న రంగంలో ఒడిదుడుకులన్నీ మాయమవుతాయి.ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.అంతేకాకుండా విజయం మీ చెంతనే ఉంటుంది.

మీ విజయాన్ని చూసి అందరూ గర్వ పడతారు.మీ కుటుంబం మీకు ఎల్లవేలలా అండగా నిలుస్తుంది.

కర్కాటకం:

ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబం సంతోషం కోసం ఎప్పుడూ కష్టపడతారు.మీ ఇంట్లో వారితో ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.పేరుకుపోయిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి.

సింహం:

ఈ రోజు ఈ రాశి వారు కొన్ని అనుకోని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.వ్యాపార సంబంధిత సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలున్నాయి.అంతేకాకుండా నిరుద్యోగులు ఉద్యోగం గురించి సఫర్ అవుతారు.మీ లక్ష్యంపై దృష్టి పెడితే మీరు అనుకున్నది సాధిస్తారు.

కన్య:

రాశి వారు ఈ రోజు చాలా బిజీ బిజీగా గడుపుతారు.తీరిక లేకుండా పనిలో లీనమవుతారు.మీ కష్టానికి తగిన ఫలితం మాత్రం తప్పకుండా పొందుతారు.స్నేహితుల నుంచి ఆర్థికంగా సహాయం పొందుతారు.

తులా:

ఈ రోజు మిమ్మల్ని అనేక కారణాలు బాధించవచ్చు.అలాగే అనేక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశాలున్నాయి.ఏదైనా పనిని ప్రారంభించడంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.మీ తెలివితేటలతో పనిచేస్తే విజయం సాధిస్తారు.

వృశ్చికం:

ఈ రోజు ఈ రాశి వారు సంతోషంగా సమయాన్ని గడుపుతారు.అలాగే శుభవార్తలు కూడా వింటారు.వ్యాపార రంగంలో అనుకోని సమస్యలు ఎదుర్కోవచ్చు.వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటే విజయం సాధించవచ్చు.

ధనస్సు:

ఈ రోజు మీకు అన్నీ అనుకూల పరిస్థితులే ఎదురవుతాయి.కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని దరిచేరతాయి.నూతన పరిచయాలు ఏర్పడతాయి.దాని మూలంగా మీకు ప్రయోజనం కలుగుతుంది.వ్యాపారంలో మంచి లాభాలను పొందే అవకాశాలున్నాయి.

మకరం:

వ్యాపార లావాదేవీల మూలంగా లాభాలను అర్జిస్తారు.సామాజిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనే తీరు పట్ల సమాజంలో మీకంటూ మంచి గౌరవం లభిస్తుంది.అనవసర కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం మంచిది.

కుంభం:

ఉన్నతాధికారుల నుంచి మీకు అనుకోని విధంగా సహాయం లభిస్తుంది.వ్యాపారాన్ని సంబంధించిన నిర్ణయాలను తీసుకుని వాటిని అమలు పరుస్తారు.ఈ రోజు మీకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

మీనం:

ఈ రోజు మీకు అదృష్టం మీ దరిచేరుతుంది.అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.ఇతరులు మీరు చేసే పనుల పట్ల అసూయను వ్యక్తం చేస్తారు.

శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉంది.వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.

#TeluguAstrology #Horoscope #November Friday #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube