తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 2 సోమవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.05

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 2 Monday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: ఉ.07.56 నుంచి 09.19 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 2 Monday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 2 సోమవారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.06.50 నుంచి 07.15 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.14 నుంచి 12.59 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

మేష రాశి వారు ఎంతో ఆశక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

ఈ రాశి వారు భూములు వాహనాలు కొన్ని సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి.ఈ రాశివారు ఆకుపచ్చ, నేరేడు రంగు దుస్తులను ధరించడం అనుకూలం.

వృషభం:

వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా కనిపిస్తుంది.నిరుద్యోగులకు, విద్యార్థులకు నూతన ఉత్సాహం కలుగుతుంది.వ్యాపారం రంగంలో పని చేసేవారికి, వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.ఈ రాశి వారు పసుపు, గులాబీ రంగు దుస్తులను ధరించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు.

మిథునం:

ఈ రాశివారు నూతన పనులను ప్రారంభించడానికి ఇదే సరైన సమయం.ఈ రాశి వారికి వ్యాపార రంగంలో పురోగతి లభిస్తుంది.ఆలయాలను సందర్శించడం, పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి.ఈ రాశివారు భూములు, వాహనాలు కొన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ రాశి వారు నేరేడు, గులాబిరంగు దుస్తులను ధరించవలెను.

కర్కాటకం:

ఈ రాశి వారికి రుణ బాధలు తొలగిపోయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.సన్నిహితులతో ఏర్పడిన తగాదాలను పరిష్కరించుకుంటారు.దూర ప్రాంతాల నుంచి ఓ శుభవార్త ను కూడా ఈ రాశివారు వింటారు.ఈ రాశి వారు పసుపు, ఆకుపచ్చ దుస్తులను ధరించవలెను.

సింహం:

ఈ రాశి వారికి ఆర్థిక వ్యవస్థలు ఏర్పడిన ఒడిదుడుకులు సద్దుమణిగాయి.కుటుంబంలో కార్యనిర్వాహణ యోచనలో కుటుంబ సభ్యులు ఉంటారు.నిరుద్యోగుల నిరీక్షణకు ఇప్పుడు సరైన సమయం.వ్యాపార రంగంలో అధిక లాభాలు రావడం వల్ల ఎంతో ఉత్సాహంగా గడుపుతారు ఈ రాశివారు గులాబీ, నీలం రంగు దుస్తులను ధరించవలెను.

కన్య:

ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభించినప్పటికీ, అది ఎంతటి కష్టతరమైన చివరకు విజయాన్ని అందుకుంటారు.రావలసిన బాకీలు అవసరానికి అందుతాయి.వ్యాపార రంగంలో గతం కంటే ప్రస్తుతం ఎంతో ఆశాజనకంగా ఉంటుంది.ఈ రాశి వారు ఆకుపచ్చ గులాబీ రంగు నిర్వహించడం ఎంతో ఉత్తమం.

తులా:

ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి.ఒక సమాచారం మీలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.ఈ రాశి వారు చేపట్టిన ఎటువంటి పనుల్లో నైనా విజయవంతంగా పూర్తి చేస్తారు.

జీవిత భాగస్వామి నుంచి మరింత సానుకూలత, ఉద్యోగాలు చేసేవారిలో గందరగోళం తగ్గుతుంది.ఈ రాశివారు ఎరుపు, తెలుపు రంగు దుస్తులను ధరించవలెను.

వృశ్చికం:

ఈ రాశి వారు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయడంతో, సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలను పంచుకుంటారు.జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు తీరుతాయి.పారిశ్రామిక రంగం వారికి కొంతమేర వారి కష్టానికి ఫలితం లభిస్తుంది.ఈ రాశివారు ఎరుపు, గులాబీ రంగు దుస్తులు ధరించాలి.

ధనస్సు:

ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం వల్ల రుణ బాధలు తొలగిపోతాయి.ఎప్పటినుంచో ఉన్న ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.ఆలయాలను సందర్శిస్తారు.

ఈ రాశివారు భూములు, వాహనాలను కొంటారు.ఈ రాశివారు గులాబీ, పసుపు రంగు దుస్తులను ధరించవలెను.

మకరం:

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడి ఇంట్లో శుభకార్యా నిర్వహణ ఆలోచనలో ఉన్నారు.ఆస్తి వివాదాలు ఎంతో చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.రాజకీయ వర్గాలకు చెందిన వ్యక్తులు ఈ రోజు ఎంతో ఉత్సాహంగా గడుపుతారు.ఈ రాశివారు నీలం, ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి.

కుంభం:

ఈ రాశి వారికి వ్యాపార రంగంలో చికాకులు తొలగిపోయి అభివృద్ధి బాటలో పయనిస్తోంది.విద్యార్థులకు ఈరోజు సానుకూల ఫలితాలు రావచ్చు.ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడం వల్ల అనుకున్న పనులు చకచకా పూర్తి చేసుకుంటారు.

ఈ రాశివారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఈ రాశి వారు నేరేడు, ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి.

మీనం:

ఈ రాశి వారికి పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో అకాల విభేదాలు తలెత్తుతాయి.వీలైనంత వరకు ఎవరితో గొడవలు, తగాదాలకు వెళ్లిపోవడం ఎంతో మంచిది.ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు.రాజకీయ వర్గాలకు చెందిన వారికి కొంతమేర ఊరట నిచ్చే విషయమని చెప్పవచ్చు.ఏ రాశి వారు ఈ రోజు గులాబీ ,పసుపు రంగు దుస్తులను ధరించాలి.

#November2 #TeluguDaily #Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU