తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 19 గురువారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.16

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 19 Thursday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.35

రాహుకాలం: మ.01.26 నుంచి 02.46 వరకు

అమృత ఘడియలు: ఉ.07.40 నుంచి 08.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.45 వరకు&lt

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి.మీ పై అధికారులను కలవడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన సమస్యలను ఎదుర్కొంటారు.స్నేహితులతో కలిసి సుదీర్ఘ పర్యటనలు చేయడం వల్ల ఎంతో ఆనందంగా గడుపుతారు.

ఈ రాశివారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఈ రాశి వారికి 70శాతం అదృష్టం మద్దతు తెలుపుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

వ్యాపార రంగంలో పని చేసేవారు అధిక శ్రమ ఎదుర్కోవాల్సి ఉంటుంది.ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారికి వారి పై అధికారుల ఆగ్రహానికి బలవుతారు.ఈ రాశి వారు కొత్తగా చేయబోయే పనులపై దృష్టిని సాధిస్తారు.వృషభ రాశి వారికి అదృష్టం 60 శాతం మద్దతు తెలుపుతుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

మిధున రాశి వారికి ఈ రోజు మధ్యాహ్న సమయం వరకు అధిక లాభాలు కలిగే సూచనలున్నాయి.ఎన్నో రోజుల నుంచి ఎదుర్కొంటున్న ఉద్యోగ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి.సాయంత్ర సమయంలో స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆనందంగా గడుపుతారు.ఈ రాశి వారికి అదృష్టం 85 శాతం కలిసి వస్తుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారు ఈ రోజు ఎంతో ఉల్లాసంగా గడుపుతారు.ప్రత్యర్థులపై విమర్శలకు తావు ఇవ్వకుండా మీ పనిలో మీరు నిమగ్నం అవ్వడం వల్ల విజయాలను చేరుకుంటారు.ఈ రాశి వారు ఈ రోజు వీలైనంత వరకు వివాదాలకు గొడవలకు వెళ్లకుండా ఉండటం ఎంతో శ్రేయస్కరం ఈ రాశివారికి 60 శాతం అదృష్టం మద్దతు తెలుపుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశివారు వృత్తిపరంగా ఎక్కువగా శ్రమించడం వల్ల విజయాలను సొంతం చేసుకుంటారు.అనవసరమైన ఇబ్బందులతో మనసు చిరాకుగా ఉంటుంది.ఈరోజు మీకు తెలియని ఏ వ్యక్తి అయినా ఇచ్చి పుచ్చుకోవడాలు చేయకుండా జాగ్రత్త వహించండి.ఈ రాశి వారికి అదృష్టం 58 శాతం మద్దతు తెలుపుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశివారు కుటుంబంతో ఎంతో ఆనందంగా గడుపుతారు.ఎన్నో రోజుల నుంచి వెంటాడుతున్న ఇంటి సమస్యలు పరిష్కారమవుతాయి.ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలను అందుకుంటారు.

ఈరోజు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.ఈ రాశి వారికి అదృష్టం 56 శాతం మద్దతు తెలుపుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి ఈ రోజు కొంతమేర ఇబ్బందికరంగా ఉంటుంది.దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.మీరు పడుతున్న సమస్యలకు పరిష్కారం తెలియక మానసిక సంక్షోభం చెందుతారు.ఈ రాశివారు వృత్తి పరంగా చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయం పొందుతారు.ఈ రాశి వారికి అదృష్టం 50 శాతం కలిసి వస్తుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారు ఈ రోజు కొంత గందరగోళ జీవితాన్ని గడుపుతారు.ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.ఈరోజు ఈ రాశి వారు వారి సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకోండి.ఈ రోజు నీకు అదృష్టం 70 శాతం మద్దతు తెలుపుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ధనస్సు రాశి వారి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఆసక్తి చూపిస్తారు.ఈ రాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడటం వల్ల కొంతమేర ప్రయోజనకరంగా ఉంటుంది.ఏమైనా కారణాలవల్ల మీకు రావలసిన డబ్బు ఆగిపోయినట్లు అయితే తిరిగి ఆ డబ్బును ఈరోజు పొందుతారు.ఈ రాశి వారికి అదృష్టం 70 శాతం కలిసి వస్తుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశివారికి ఎంచుకున్న రంగంలో సహోద్యోగులతో లేదా పై అధికారుల నుంచి విభేదాలు ఏర్పడవచ్చు.అనుకోకుండా మీ ఇంటికి అతిథులు రావడం వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి.దంపతులు వారి వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతారు.ఈ రాశి వారికి అదృష్టం 67 శాతం మద్దతు తెలుపుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కుంభ రాశి వారు రవాణా సానుకూల ప్రభావం తో విజయాలను అందుకుంటారు.ఈ రాశి వారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరికి విజయాన్ని అందుకుంటారు.గృహ వస్తువుల వినియోగం కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది.ఈ రాశి వారికి అదృష్టం 61 శాతం మద్దతు తెలుపుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశివారు సంతానానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.వాతావరణంలోని మార్పుల వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.అందువల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఎంతో అవసరం.ఈ రాశి వారికి అదృష్టం 62 శాతం కలసి వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube