ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.12
సూర్యాస్తమయం: సాయంత్రం 05.33
రాహుకాలం: మ.12.06 నుంచి 01:26 వరకు
అమృత ఘడియలు: ఉ.06.20 నుంచి 07.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.30 నుంచి 12.15 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు ఈ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.ఎప్పటి నుంచో రావలసిన పాతబాకీలు వసూలవుతాయి.కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి అవసరమైన డబ్బులు ఇతరుల నుంచి రుణంగా తీసుకుంటారు.వృత్తిపరంగా ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.అయితే చివరిగా విజయాలను అందుకోవడం తో ఈరోజు ఎంతో ఆనందంగా గడుపుతారు.
వృషభం:

ఈ రాశివారు వారి సమయాన్ని ఖాళీగా వృధా చేయకుండా పనిలో నిమగ్నం అవడంతో సమాజం కీర్తి ప్రతిష్టలను పొందుతారు.అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.ఈ రాశివారికి వైవాహిక జీవితంలో కొన్ని దుష్పరిణామాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి.
మిథునం:

స్టాక్ మార్కెట్ లో,వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టిన వారికి ఈ రోజు అధిక నష్టాలను చవి చూస్తారు.అందువల్ల పెట్టుబడి పెట్టే ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఎంతో ఉత్తమం.ఉద్యోగరీత్యా గత కొద్దిరోజుల నుంచి ఎదురుకుంటున్న సమస్యల నుంచి ఈరోజు విముక్తి పొందుతారు.మీ రాశి వారి కుటుంబ సభ్యులతో సహోద్యోగులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.
కర్కాటకం:

ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంది.అదనంగా డబ్బులు సంపాదించడం కోసం కొత్త ఆలోచనలు చేస్తారు.మీకు దగ్గరైన వారితో మీ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు.వృత్తి, వ్యాపార రంగాలలో పని చేసేవారికి ఈరోజు ఎంతో శ్రమతో కూడుకున్నది.ఏ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.
సింహం:

ఈ రాశివారు ఈరోజు ఎంతో బిజీగా గడుపుతారు.వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఆర్థిక లాభాలను ఆర్జించవచ్చు.కుటుంబ సభ్యులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.ఈ రాశి వారు వ్యాపార రంగంలోఎంతో అభివృద్ధిని కనబరుస్తారు.
కన్య:

ఇది రాశి వారి ఈరోజు వారి సమయాన్ని ఎంతో బిజీగా గడుపుతారు.వ్యాపార రంగాలలో పెట్టుబడులు పెట్టేవారు ఎవరినీ సంప్రదించకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.రాశి వారు జీవిత భాగస్వామితో గడపటానికి ఎంతో అనువైన సమయం.
తులా:

ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో అసౌకర్యంగా చికాకుగా అనిపిస్తుంది.మానసికంగా ఆందోళన చెందుతారు.ఈ విషయంలో మీ స్నేహితుడు సమస్యలు పరిష్కరించి మిమ్మల్ని ఆనందింప చేస్తాడు.ఈ రాశి వారు ఏదైనా కొత్త ప్రాజెక్టులను స్వీకరించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
వృశ్చికం:

ఈ రాశి వారు పెట్టుబడులు, భవిష్యత్తు అన్యాయాల గురించి గోప్యంగా ఉంచడం ఎంతో శ్రేయస్కరం.ఏ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఇంటికి అతిథులు రావడం వల్ల కొంతమేర డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చిన, ఈ రోజంతా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగరీత్యా అనుకున్న సమయంలో పనులు పూర్తి కావడం వల్ల పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
ధనస్సు:

ఏ రాశి వారికి గృహచలనం రీత్యా ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తులను కలిసే అవకాశాలు ఉన్నాయి.ఈ పరిచయం వల్ల మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.ఎవరిది అనవసరంగా ఖర్చు చేస్తున్నారు ఖర్చులను తగ్గించుకునే డబ్బును పొదుపు చేసుకోవడం ఎంతో మంచిది.గత వెంచర్ల నుంచి పొందిన విజయాలు మీకు ఎంత నమ్మకాన్ని కలిగిస్తాయి.
మకరం:

ఈ రాశివారికి తోబుట్టువుల సహాయ సహకారాలు అందడం వల్ల ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు.ఈ రోజు కొత్త ప్రాజెక్టులను చేపట్టే వారు ప్రాజెక్టులను వాయిదా వేసుకోవడం మంచిది.అలాగే ఖర్చులను కూడా తగ్గించుకోవడం ఎంతో ఉత్తమం.
కుంభం:

ఎన్నో రోజుల నుంచి రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు రుణాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎంతో సన్నిహితంగా ఉండే సహ ఉద్యోగులతో కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు.వైవాహిక జీవితంలో ఎంతో రహస్యమైన విషయాలను బయటకు చెప్పక పోవడం మంచిది.
మీనం:

ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే సిబ్బందికి ఈరోజు అనేక సమస్యలు తలెత్తుతాయి.మీరు తెలియకుండానే తప్పులు చేయడం వల్ల ఈ సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఎటువంటి సమాచారం లేకుండా అనుకోకుండా మీ ఇంటికి అతిథులు వస్తారు.
అందువల్ల కొంతమేర డబ్బు ఖర్చు అవుతుంది.

LATEST NEWS - TELUGU