తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 4, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.39

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 4 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.15

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 4 Tuesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 4, మంగళవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:అష్టమి మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా జరుగుతుంది.ఆర్థిక లాభాలు ఎక్కువగా పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ ఆలోచన వల్ల మీ వ్యక్తిత్వం గురించి బయట పడుతుంది.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.ఇతరుల సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రుల తో మాట్లాడాలి.

సంతానం పట్ల ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.మీ స్నేహితుల సహాయం ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తులో మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల చింత చెందాల్సిన అవసరం లేదు.మీతో సన్నిహితంగా ఉండే వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఈరోజు కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

తులా:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రుల తో మాట్లాడాలి.దీనివల్ల మీకు కొన్ని సలహాలు అందుతాయి.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.ఇతరుల మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తీరికలేదు సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో అనవసరంగా వాదనలకు దిగకండి.ఈరోజు సమయాన్ని కాలక్షేపం చేయకూడదు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తులో దీనివల్ల సమస్య ఎదురవుతుంది.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.సొంత ఆలోచనల వల్ల సమస్యలు తప్పవు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల మీకు లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

మీ స్నేహితులతో కలిసి కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.

#TeluguDaily #Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU