తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 25, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 25 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.21

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 25 Tuesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 25, మంగళవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:విశాఖ మంచి నక్షత్రము కాదు.వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించాలి.

ఆవేశాలకు దూరంగా ఉండటం మంచిది.ఉద్యోగం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు ఈ రోజు విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికపరంగా సంపాదించడానికి దృష్టి ఎక్కువగా పెడతారు.ఈరోజు మీ స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కేవలం ఇంటికి సంబంధించిన వస్తువులే కొనాలి.కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ తోబుట్టువులతో కలసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొంతవరకు లాభాలు పొందుతారు.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల ఆరోగ్యం కాస్తా నీరసంగా ఉంటుంది.అనవసరంగా వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో వ్యాపారం గురించి ముఖ్యమైన నిర్ణయాల గురించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల్లో పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.కొన్ని వాదనలు జరిగే అవకాశం ఉంది.అనవసరంగా వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా కాస్త పొదుపు చేయడం మంచిది.చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఆరోగ్యం పట్ల వీలైనంత శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

మకరం:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.చాలా రోజుల నుండి అనుకుంటున్నా ఒక విషయం విజయవంతం అవుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

బంధువులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడినిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది.

#TeluguDaily #Daily Horoscope #Tuesday #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU