ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.46
సూర్యాస్తమయం: సాయంత్రం 06.39
రాహుకాలం: సా.3.00 ల4.30
అమృత ఘడియలు: ఉ.నవమి,సా.5.00ల6.00
దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23ప.11.15ల12.00
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈ రోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.తిరిగి సంపాదించి స్తోమత మీలో ఉంది.ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయండి.
వృషభం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.సమయం అనుకూలంగా ఉంది.
మిథునం:
ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.అనారోగ్య సమస్యతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేయటం వల్ల కొత్త పరిచయాలు మీ జీవితం లోకి వస్తాయి.మీ వ్యక్తిగత విషయాలను మీ సన్నిహితులతో పంచుకోకండి.
కర్కాటకం:
ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
ఏదైనా పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.
సింహం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఇతరులతో గొడవకు దిగుతారు.దీనివల్ల మీపై వ్యతిరేక దృష్టి ఏర్పడుతుంది.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఖర్చులు ఎక్కువగా చేయకపోవడమే మంచిది.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.
తులా:
ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.లేదంటే భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనారోగ్య సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంది.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.శత్రువులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
వృశ్చికం:
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి.
ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
ధనస్సు:
ఈరోజు మీరు కొన్ని వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.
మకరం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.ఇతరులతో కలిసి కొన్ని విషయాలను పంచుకుంటారు.
సొంత నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.
కుంభం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయటానికి సమయాన్ని కేటాయిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.విలువైన వస్తువులు కాపాడుకోవాలి.
మీనం:
ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.దీనివల్ల మీరు చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయి.
కొన్ని విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.