తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 14, శనివారం, వైశాఖ మాసం  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50సూర్యాస్తమయం: సాయంత్రం 06.34రాహుకాలం: ఉ.9.00 ల10.30అమృత ఘడియలు: ఉ.10.40ల12.00,సా.3.30ల5.30దుర్ముహూర్తం:ఉ.7.41ల8.32

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 14 Saturday 2022-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఈ రోజు మీరు ఒక విషయం గురించి పదేపదే ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట కొన్ని పోరాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది.శ్రద్ధ బాగా అవసరం.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

వృషభం:

తీరిక లేని సమయం గడుపుతున్న మీకు ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని దూరప్రయాణాలు చేయాలని ప్లాన్ చేస్తారు.కొన్ని విషయాల గురించి బాగా ఆలోచించాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.సమయం అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని చేసినా అది పోటీగా ఉంటుంది.దీనివల్ల మీరు మరింత శ్రద్ధ పెట్టడం అవసరం.ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.కొన్ని అవసరాలు అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల బాగా ఆలోచిస్తారు.కొత్త సంబంధాలు పెరుగుతాయి.ఇతరులతో ఎక్కువగా సన్నిహితంగా ఉండకపోవడం మంచిది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని పనులు చేసేటప్పుడు ఒత్తిడి గా ఫీల్ అవుతారు.

సింహం:

  ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.అనారోగ్య సమస్య మిమ్మల్ని మరింత బాధ పెడుతుంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

  ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.మీ కుటుంబ సభ్యులకు కొన్ని సలహాలు ఇస్తారు.

దీనివల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

తులా:

ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

వృశ్చికం:

 ఈ రోజు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

ధనస్సు:

 ఈ రోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ జీవితంలోకి కొన్ని కొత్త పరిచయాలు ఎదురవుతాయి.దీని వల్ల సంతోషంగా ఉంటారు.

మకరం:

  ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం:

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని పనులు వాయిదా పడతాయి.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

మీనం:

 ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube